Begin typing your search above and press return to search.

కాపుల క్రాస్ ఓటింగ్.. ఎవరికి లాభం?

By:  Tupaki Desk   |   8 May 2019 5:52 AM GMT
కాపుల క్రాస్ ఓటింగ్.. ఎవరికి లాభం?
X
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. దాదాపు నెలన్నరకు ఫలితాలు ఉండడంతో నేతలు రిలాక్స్ అయ్యి ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. ఫలితాలకు ఇంకా 15రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ ల జోరు ఊపందుకుకుంది. వైసీపీ - టీడీపీలపై గెలుపు ఓటములపై భారీగా పందాలు కాస్తున్నారు. ఫలితాల ముందర వరకూ ఇంకా బెట్టింగ్ లు పెరిగే అవకాశం కనిపిస్తోంది..

తూర్పు గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎంతనేది ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. మొన్న చంద్రబాబు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన సమీక్షలో కూడా జనసేన ప్రభావం భారీగా ఉందని.. అది టీడీపీకి లాభమా.? వైసీపీకి లాభమా అంచనాకు అందడం లేదని అన్నారని టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప మీడియాకు చెప్పుకొచ్చారు.

దీన్ని బట్టి ఎన్నికల ముందర అసలు జనసేన ప్రభావం ఉండదని ఖరాఖండీగా భావించిన టీడీపీ - వైసీపీలు ఇప్పుడు అదే జనసేన ఎవరి పుట్టి ముంచుతుందోనన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయట..

ఇక తాజా విశ్లేషణల లోనూ తూర్పుగోదావరి జిల్లాలోని అరడజను అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన ఓట్ల చీలిక ప్రభావం టీడీపీ - వైసీపీ గెలుపు ఓటములపై భారీగా ప్రభావం పడుతుందని తేలిందట..

తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కాపులు - ఇతర సామాజికవర్గాలు అసెంబ్లీకి వైసీపీ వేసి పార్లమెంట్ కు వచ్చేసరికి జనసేన నిలబెట్టిన వారి సామాజికవర్గ నేతకే వేశారని సమాచారం. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న కాపులంతా ఈ ఎన్నికల్లో వైసీపీకే వేశారంటున్నారు. కానీ పార్లమెంట్ కు వచ్చేసరికి మాత్రం కాపు నాయకుడైన జనసేన అభ్యర్థికి వేసినట్టు చెబుతున్నారట.. సో రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో క్రాస్ ఓటింగ్ జరిగినట్టు అర్థమవుతోంది. దీన్ని అసెంబ్లీ పోరులో వైసీపీకే లాభం కలిగే అవకాశాలున్నాయంటున్నారు.