Begin typing your search above and press return to search.
‘వ్యాక్సిన్ వేయించుకుంటే నా 8 మంది పిల్లల్ని ఎవరు పోషిస్తారు?’
By: Tupaki Desk | 31 Jan 2022 6:35 AM GMTవిన్నంతనే విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఇది నిజం. టీకా వేయించుకోవటానికి వెనుకా ముందు ఆలోచించకుండా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లే వాళ్లు ఉన్నట్లే.. టీకా అన్నంతనే ఆమడదూరాన ఉండటం.. టీకా వేసుకోవాలంటే ససేమిరా అనటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ దేశాల్లో అయితే.. టీకాను వ్యతిరేకించే వారు పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు చేస్తుంటారు. మన దేశంలో ఇలాంటివి లేకున్నా.. వ్యక్తిగతంగా వ్యతిరేకించేటోళ్లు.. టీకా వేసుకోకుండా మొండిగా ఉండేవారు కనిపిస్తుంటారు.
ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఈ కోవలోకే వస్తుంది. తమిళనాడులోని తిరుపత్తూర్ పురికముని మిట్టలో 1159 మంది ఉంటే 1158 మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. కుడియన్ అనే వ్యక్తి మాత్రం టీకా వేసుకోవటానికి ససేమిరా అంటున్నాడు. అతడికి టీకా వేయటానికి వెళ్లిన సిబ్బందికి ససేమిరా అన్నాడు. టీకా వేసుకోనంటూ హంగామా చేశాడు.
తనకు ఎనిమిది మంది పిల్లలని.. టీకా వేసుకొని తనకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత? అని ప్రశ్నించటమే కాదు.. తన 8 మంది పిల్లల పోషణ మాటేమిటి? అని ప్రశ్నించాడు. తనకు కనీసం ఇల్లు కూడా ఇవ్వలేదని.. కుల ధ్రువీకరణ పత్రం కూడా రాలేదన్నాడు. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న తనకు ఏమైనా అయితే.. ఎనిమిది మంది పిల్లల్ని ఎవరు పోషిస్తారని ప్రశ్నించాడు.
అతగాడి ప్రశ్నలకు స్థానిక సర్పంచ్ ఎంట్రీ ఇచ్చి.. టీకా వేసుకున్న తర్వాత ఏమైనా అయితే తాను బాధ్యత తీసుకుంటానని మాట ఇవ్వటంతో టీకా వేయించుకోవటానికి ఓకే చెప్పాడు. ఒక వ్యక్తికి టీకా వేసేందుకు జరిగిన ప్రయాస ఇప్పుడు అందరిని తెగ ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం విన్నాక.. మన దేశంలోనూ ఇలాంటి వారు ఉంటారా? అన్న భావన కలుగక మానదు.