Begin typing your search above and press return to search.
మునుగోడులో టీడీపీ ఓట్లు ఎవరికి? బాబు మద్దతు ఎటు?
By: Tupaki Desk | 22 Oct 2022 11:30 PM GMTమునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు కోసం బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి స్వయంగా చంద్రబాబును కోరాడని.. అక్కడున్న టీడీపీ ఓట్లు తనకు పడేలా మద్దతు ఇవ్వాలని అన్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఏమైందో కానీ దీన్ని టీఆర్ఎస్ అస్త్రంగా మలిచింది. మునుగోడులో ఆంధ్రా బాబుతో బీజేపీ పొత్తు అని హైలెట్ చేసింది. దీంతో రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయ్యారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మహారంజుగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ఇక అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేయబోతున్నాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళుతున్నాయి.వీటికి తోడు చిన్న పార్టీలు, బలమైన ఇండిపెండెంట్లు కూడా గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు అందరి చూపు టీడీపీ, షర్మిల పైనే ఉంది.
తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఒకప్పుడు ఉండేది. నేతలంతా ఇతర పార్టీల్లోకి జంప్ కావడంతో ఇప్పుడు ఆ ఓట్లు ఎవరికి బదిలీ అవుతాయన్నది ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు కూడా బాగానే ఉన్నారు. షర్మిల పార్టీ మద్దతు ఈ ఎన్నికల్లో ఎవరిదనేది తేలడం లేదు. ఆమె బరిలో లేకపోవడంతో కాంగ్రెస్ కు వీరి ఓట్లు పడే ఛాన్స్ ఉంది. అయితే రెడ్డి సామాజికవర్గానికి చెందిన రాజగోపాల్ రెడ్డికి ఆ రెడ్డి కులం ఓట్లు పడేలా షర్మిల లోపాయికారి మద్దతు తెలుపుతోందని టాక్ నడుస్తోంది.
ఇక టీడీపీ ఓట్లు ఎవరికి పడుతాయన్నదే ఇక్కడ అసలు సమస్య. ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా నిలవడంతోపాటు ఆపార్టీ శ్రేణులు ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం నుంచి సరైన మార్గనిర్ధేశనం లేకపోవడంతో కార్యకర్తలు చౌరస్తాలో ఉన్నట్లు తెలుస్తోంది.
మునుగోడులో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల హవాలో ఇక్కడి నుంచి ఒక్కసారి కూడా గెలవకపోయినా ప్రతి ఎన్నికల్లో నిర్ణయాత్మక ఓట్లు టీడీపీకి ఉండేవి. ఇప్పటికీ కనీసం 10వేల ఓటు బ్యాంకు టీడీపీకి ఉందట.. ఇక్కడి నుంచి పోటీకి టీడీపీ తరుఫున జక్కలి ఐలయ్య యాదవ్ మొగ్గుచూపారు. కానీ చంద్రబాబు పోటీకి ఆసక్తి చూపకపోవడంతో విరమించుకున్నారు.
చంద్రబాబు మళ్లీ బీజేపీవైపు కదులుతున్నందున టీడీపీ ఓట్లు ఆ పార్టీకే పడే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ ఆయన బహిరంగంగా మాత్రం ఎవరికీ మద్దతు ప్రకటించలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.