Begin typing your search above and press return to search.

బీఆర్ ఎస్ అడుగుల‌తో ఏపీలో న‌ష్టం ఎవ‌రికి?.. పొలిటిక‌ల్ డిబేట్

By:  Tupaki Desk   |   3 Jan 2023 3:28 AM GMT
బీఆర్ ఎస్ అడుగుల‌తో ఏపీలో న‌ష్టం ఎవ‌రికి?.. పొలిటిక‌ల్ డిబేట్
X
ఏపీలో బీఆర్ ఎస్ అడుగులు వేస్తే.. పార్టీ పుంజుకునే ప‌రిస్థితి ఉంటే ఎవ‌రికి న‌ష్టం? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. తాజాగా రెండు సామాజిక వ‌ర్గాల‌ను కేసీఆర్ టార్గెట్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. దీనిలో ప్ర‌ధానంగా కాపులు ఉన్నారు. తోట చంద్ర‌శేఖ‌ర్‌.. రాష్ట్ర బీఆర్ ఎస్ అధ్య‌క్షుడుగా ప‌గ్గాలు చేప‌ట్టిన నేప‌థ్యంలో ఆయ‌న ఏమేర‌కు పార్టీని బ‌లోపేతం చేస్తార‌నేది ప్ర‌శ్న‌. బీఆర్ ఎస్‌ను క్షేత్ర‌స్థాయిలోకి తీసుకువెళ్లాల్సి ఉంది.

అయితే.. ఎంత‌గా పార్టీని బ‌లోపేతం చేయాల‌న్నా.. త‌న సొంత సామాజిక వ‌ర్గం తోట మాట వింటుందా? అనేది చూడాలి. కాపులు ప్ర‌స్తుతం జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా రాజ‌కీ య వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే.. వీరిని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం.. ఏదో బీఆర్ ఎస్ చేసే అవ‌కాశం ఉంది. దీనివ‌ల్ల జ‌న‌సేన‌కు లేదా.. టీడీపీకి న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

లేక‌.. బీసీల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేసినా.. అది ప‌రోక్షంగా లేక ప్ర‌త్య‌క్షంగా టీడీపీకి ఇబ్బంది గా మారుతుంద‌ని అంటున్నారు. ఇక‌, రావెల కిశోర్‌బాబు.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు అయినా. ఆయ‌న‌కు ఫాలోయింగ్ లేక‌పోవ‌డం.. పెద్ద మైన‌స్‌. ఒక‌వేళ వ‌చ్చినా.. ఎస్సీ వ‌ర్గంలో మాదిగ రిజ‌ర్వేష‌న్ అంశం కేసీఆర్‌కు పెద్ద ప‌రీక్ష‌గా మారుతుంది. రావెల ఆ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావడం గ‌మ‌నార్హం.

ఇక‌, ఇప్పుడు అధికార పార్టీ విష‌యానికి వ‌స్తే.. వైసీపీకి అనుకూల ఓటు బ్యాంకు మ‌ళ్లీ ఆ పార్టీకే వేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అయితే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ఎలానూ ఉండ‌నుంది. దీనిని చీల‌కుండా చేస్తాన‌ని చెప్పిన జ‌న‌సేనకు ఇది ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంది.

ఎందుకంటే.. బీఆర్ ఎస్ 175 స్థానాల్లో పోటీ చేయ‌క‌పోయినా.. 100 స్థానాల్లో చేసినా.. వ్య‌తిరేక ఓటు చీలుతుంది. ఇది ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా కూడా వైసీపీకి మేలు చేస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.