Begin typing your search above and press return to search.
హెచ్‌సీఏకు కొత్త ప్రెసిడెంట్ .. అజారుద్దీన్ స్థానంలో వచ్చేదెవరంటే ?
By: Tupaki Desk | 26 Jun 2021 9:30 AM GMTహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో వర్గపోరు రోజురోజుకి ఎక్కువ అవుతుంది. హెచ్ సీఏ ప్రెసిడెంట్ గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మొహ్మద్ అజారుద్దీన్ ను తొలగించిన అపెక్స్ కౌన్సిల్, హెచ్ సీఏలో ఏకంగా ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. దీనితో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనపై తొలుత తనదైన శైలిలో నిరసన తెలిపేందుకు యత్నించిన అజార్, ఆ తర్వాత కారణమేమిటో గానీ సైలెంట్ అయిపోయారు. హెచ్ సీఏ తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ లేఖ విడుదల చేసింది. ఈ మధ్య అజారుద్దీన్ హెచ్ సీఏ సభ్యత్వం రద్దు చేసినట్లు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం లెటర్ జారీ చేసింది. లోధా కమిటీ సిఫార్సుల మేరకు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ తీర్మానం చేసింది.
ఇక ఉద్దేశపూర్వకంగా హెచ్ సీఏ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను ఇటీవలే అపెక్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. హెచ్ సీఏ లో అతని సభ్యత్వం రద్దు చేసి షోకాజ్ నోటీస్ జారీచేసింది. కాగా నోటీసులపై అజారుద్దీన్ వివరణ ఇవ్వకపోవడంతో తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా హెచ్ సీఏ తయారయ్యింది. అయితే, క్రికెట్ సీజన్ మొదలవుతున్న వివాదాల్లో మునిగి తేలుతున్న హెచ్ సీఏ ఇంకా బయటపడలేదు.