Begin typing your search above and press return to search.
గ్రౌండ్ రిపోర్ట్: 'విశాఖ నార్త్' ఎవరికి బెస్ట్..?
By: Tupaki Desk | 1 April 2019 5:30 PM GMTఅసెంబ్లీ నియోజకవర్గం: విశాఖ ఉత్తరం
టీడీపీ: గంటా శ్రీనివాసరావు
బీజేపీ: పెన్మత్స విష్ణుకుమార్
వైసీపీ: కేకే రాజు
రాష్ట్రరాజకీయాలు ఒకవైపు.. విశాఖనార్త్ ఒకవైపు అన్నట్లు సాగుతోంది సార్వత్రిక పోరు. రాష్ట్రంలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. విశాఖ నార్త్‌లో మాత్రం ప్రధానంగా టీడీపీ, బీజేపీల మధ్య పోరు నెలకొనడం విశేషం. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో ఇక్కడి సీటును బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ నుంచి పెన్మత్స విష్ణుకుమార్ గెలుపొందారు. ఆ తర్వాత బలమైన నాయకుడిగా ఈయన నియోజకవర్గంలో ఎదిగారు. ఈ ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ నుంచి ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ప్రతీసారి కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకునే ఆయన ఈసారి విశాఖ నార్త్ ను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆయన ప్రతి 5 ఏళ్లకు నియోజకవర్గాన్ని మారుస్తూ పోటీ చేసిన ఏ నియోజకవర్గంలోనూ ఇప్పటివరకు ఓడిపోలేదు. మరోవైపు వైసీపీ నుంచి కొత్త అభ్యర్థి కేకే రాజు బరిలో ఉన్నారు.
* విశాఖ ఉత్తరం నియోజకవర్గం చరిత్ర:
ఓటర్లు:2 లక్షల 56వేలు
*నియోజకవర్గ చరిత్ర:
కొన్నేళ్ల క్రితం వరకూ విశాఖ ఉత్తర నియోజకవర్గం విశాఖ-2లో ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో విశాఖ ఉత్తరంగా ఏర్పాటైన ఈ నియోజకవర్గం పురుడు పోసుకుంది. 2009లో టీడీపీ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు ఘన విజయం సాధించారు. 2014లో బీజేపీ అభ్యర్థి పెన్మత్స విష్ణుకుమార్ గెలుపొందారు.
* మంత్రి గంటాకు మళ్లీ కొత్తే..
ప్రతీసారి నియోజకవర్గాన్ని మార్చే గంటా శ్రీనివాస్ కు ఈసారి పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ నార్త్ ను కట్టబెట్టారు. గత ఎన్నికల్లో భీమిలీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు బాగానే చేసినా టీడీపీ నిర్వహించిన సర్వే ప్రకారం ఆయన ఓడిపోతాడని తేలింది. దీంతో గంటా శ్రీనివాసరావుకు విశాఖ నార్త్ ను కేటాయించాల్సి వచ్చింది. నియోజకవర్గం కొత్తే అయినా ప్రజల్లోకి చొచ్చుకు వెళుతూ.. కార్యకర్తలకు దగ్గరవడం గంటా స్టైల్. దీంతో ఆయన ఈ నియోజకర్గంలో గెలుపు పెద్ద కష్టమేమం కాదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గంటా మేనల్లుడు రాజకీయ వ్యూహాన్ని రచించి నియోజకవర్గంలో ప్రచారం చేసేలా సిద్ధం చేశాడు. సమస్యలున్న ప్రాంతాలను తెలుసుకొని అక్కడికి నేరుగా వెళ్తున్నారు.
* అనుకూలతలు:
-ఓటమెరుగని నేత
-పార్టీ బలంగా ఉండడం
-గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి
* ప్రతికూలతలు:
-నియోజకవర్గానికి నాన్ లోకల్ అభ్యర్థి కావడం
-బీజేపీ గట్టి పోటీనిస్తుండడం
* ఒంటరిగా పెన్మత్స గెలుస్తాడా..?
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఇక్కడి సీటును బీజేపీకి కేటాయించింది. ఆ పార్టీ నుంచి పెన్మత్స విష్ణుకుమార్ విజయం సాధించారు. ఆ సమయంలో బీజేపీతో పాటు టీడీపీ శ్రేణులు కలిసి ప్రచారం చేశారు. దీంతో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేక ఓట్లన్నీ బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. అయితే ఈసారి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో చేసిన అభివృద్ధి పనులు ఆయనను గట్టెక్కిచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యేగా ప్రజలకు చేరువ అవ్వడం.. ప్రజా సమస్యలు తీర్చడం.. రాష్ట్రవ్యాప్తంగా మాస్ లీడర్ గా ఆయన ఎదగడం.. కలిసి వస్తుందని అంటున్నారు.. మరోవైపు వివాదరహితుడిగా, సౌమ్యుడిగా విష్ణుకుమార్ కు ప్రజల్లో మంచి పేరుంది.
* అనుకూలతలు:
-నియోజకవర్గంలో మంచి పేరు
-ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులు
-వ్యక్తిగతంగా ఫాలోయింగ్
*ప్రతికూలతలు:
-హోదా విషయంలో బీజేపీపై వ్యతిరేకత
-ప్రత్యర్థి గంటా శ్రీనివాస్ బలమైన నేత కావడం
-కేడర్ తక్కువగా ఉండడం
*వైసీపీ ప్రభావం చూపేనా?
వైసీపీ నుంచి కేకే రాజు బరిలో ఉన్నా ప్రజల్లోకి దూసుకుపోవడం లేదనే చర్చ సాగుతోంది. అయిన కొత్త అభ్యర్థి కావడంతో ప్రజల్లో ఆదరణ పొందలేకపోతున్నారు. అయితే వైసీపీ గాలి, జగన్ వేవ్ కలిసి వస్తుందని నమ్ముతున్నారు. గత నాలుగేళ్లలో ఇక్కడ పార్టీ పుంజుకుంటోంది. వైసీపీ అధినేత జగన్ ఇమేజ్ తో పార్టీకి బలం ఉండడంతో కేకే రాజు ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా మాత్రం ఇక్కడ టీడీపీ, బీజేపీల మధ్యే పోరు ఉండనుంది.
*గెలుపు దోబూచులాట..
ప్రతీసారి నియోజకవర్గం మారి పోటీచేసే గంటా ఈసారి కూడా అదే సెంటిమెంట్ ను నమ్ముకున్నారు. ఇక బీజేపీ విష్ణు ఇక్కడ బలంగా ఉన్నారు. వైసీపీ కొత్త అభ్యర్థి కూడా ఏమేరకు ఓట్లు చీల్చుతాడో చెప్పలేం. ఈ నేపథ్యంలోనే టీడీపీ పథకాలు, అధికార తోడ్పాటుతో గంటా గెలుస్తాడా? లేక విష్ణు కుమార్ తన పరపతితో నెగ్గుకు వస్తాడా? మధ్యలో వైసీపీ ప్రభావం ఎంతనేది అంతుచిక్కకుండా ఉంది.