Begin typing your search above and press return to search.
గ్రౌండ్ రిపోర్ట్ : కొమురంభీం పోరుగడ్డలో గెలుపెవరిది?
By: Tupaki Desk | 1 April 2019 5:27 AM GMTపార్లమెంట్ నియోజకవర్గం: ఆదిలాబాద్
టీఆర్ ఎస్: గేడం నగేశ్
కాంగ్రెస్: రాథోడ్ రమేశ్
బీజేపీ: సోయం బాపూరావు
మన్యంవీరుడు కొమురంభీం పోరుగడ్డ, అడవుల జిల్లా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సార్వత్రిక పోరు త్రిముఖంగా సాగుతోంది. ఇక్కడ టీఆర్ ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ గేడం నగేశ్ కే టికెట్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ నుంచి రాథోడ్ రమేశ్ కు కేటాయించారు. రాథోడ్ రమేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా పార్టీ అధిష్టానం ఆయనకే టికెట్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక కాంగ్రెస్ లో టికెట్ ఆశించి రాకపోవడంతో చివరి నిమిషంలో బీజేపీలో చేరిన సోయం బాపూరావు వెంటనే టికెట్ తెచ్చుకొని బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గం ఎస్టీలకే కేటాయించినప్పటికీ ఇక్కడ లంబాడా, ఆదివాసీల మధ్య ఎప్పటి నుంచో వైరం సాగుతోంది. అందుకే టీఆర్ ఎస్, బీజేపీలు ఆదివాసీకి చెందిన వారికి ఇవ్వగా కాంగ్రెస్ మాత్రం మాజీ ఎంపీగా పనిచేసిన లంబాడా అభ్యర్థికి కేటాయించింది.
* పార్లమెంట్ నియోజకవర్గం ఆదిలాబాద్ చరిత్ర
ఓటర్లు:14 లక్షల 78 వేలు
*మరోసారి గేడం నగేశ్ కే...
గత ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరుపున పోటీ చేసిన గేడం నగేశ్ లక్షా 70 వేల ఓట్లతో గెలుపొందారు. అంతకుముందు టీడీపీలో కొనసాగిన నగేశ్ టీఆర్‌ఎస్‌లోకి రాగానే టికెట్ అందుకొని పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు మరోసారి ఆయనకే టికెట్ కేటాయించడంతో రెండోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన గేడం నగేశ్ కు ఆ అనుభవమే ఇప్పుడు తన గెలుపుకు కారణం అవుతుందని ఆశపడుతున్నారు. అయితే ఆదివాసీ వర్గానికి చెందిన ఆయనకు లంబాడాల ఓట్లు పడే అవకాశం లేదు. దీంతో అయినా ఆదివాసీల ఓట్లు ఎక్కువగా ఉండడంతో తన గెలుపు ఖాయమని ప్రచారం చేస్తున్నారు.
* అనుకూలతలు:
-రాజకీయ అనుభవం ఉన్న నేత
-ఆదివాసీల సపోర్టు
-టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బలం
* ప్రతికూలతలు:
-బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సోయం బాపురావు ఓట్లు చీలే అవకాశం
-నియోజకవర్గంలో అభివృద్ధిపై పట్టించుకోలేదనే ఆరోపణ
* అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా రాథోడ్ రమేశ్ కే టికెట్..
టీడీపీ కంచుకోటగా ఆదిలాబాద్ నియోజకవర్గం ఉన్నప్పుడు రాథోడ్ రమేశ్ ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ఎంపీగా పనిచేశారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన టీఆర్ ఎస్ లోకి వెళ్లారు. అక్కడ ఖానాపూర్ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లోకి వెళ్లి ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ తెచ్చుకున్నారు. గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన గట్టి పోటినిచ్చి ఓడిపోయారు. దీంతో పార్టీ అధిష్టానం ఆయనకే సీటు కేటాయించింది.
*అనుకూలతలు:
-ఎంపీగా పనిచేసిన అనుభవం
-నియోజకవర్గంపై పట్టు సాధించడం
-పార్టీ కేడర్ పుంజుకోవడం
*ప్రతికూలతలు:
-ఆదివాసీల ఓట్లు పడే అవకాశం లేదు
-పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడా సపోర్టు లేకపోవడం
* ఆదిలాబాద్ లో ఆదివాసీలా? లంబాడాలా.?
గత డిసెంబర్‌లో బోథ్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన సోయం బాపూరావు.. రాథోడ్ బాపూరావు చేతిలో ఓడిపోయారు. దీంతో ఆయన అదే పార్టీ కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఆశించారు. కానీ రమేశ్ రాథోడ్ కు కాంగ్రెస్ కేటాయించడంతో ఆయన బీజేపీలోకి చేరిన వెంటనే ఎంపీ టికెట్ కేటాయించింది పార్టీ అధిష్టానం. ఆదివాసీ వర్గానికి చెందిన ఆయన వారి హక్కుల కోసం పోరాడారు. అయితే నియోజకవర్గంలో మాత్రం ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే సాగుతోంది. మరోవైపు ఇక్కడ లంబాడాలు, ఆదివాసీల మధ్య పోరు ఎంతోకాలంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారోనని ఉత్కంఠ వాతావరణం నెలకొంది.