Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: ఆముదాలవలసలో బావ, బామ్మర్ధి ఫైట్

By:  Tupaki Desk   |   2 April 2019 3:30 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: ఆముదాలవలసలో బావ, బామ్మర్ధి ఫైట్
X
అసెంబ్లీ నియోజకవర్గం: ఆముదాలవలస
టీడీపీ : కూన రవికుమార్
వైసీపీ : తమ్మినేని సీతారం

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ నుంచి స్వయానా బావ, బామ్మర్ధులు రంగంలో ఉండడంతో పోరు ఆసక్తిగా మారింది. రెండు దఫాలుగా వీరే ప్రత్యర్థులు.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పోటీపడుతున్నారు. ఇప్పుడు సిక్కోలు ఈ బావ, బావమరుదుల్లో ఎవరు గెలుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.

*బావా, బామ్మర్ధులే ప్రత్యర్థులు..
తమ్మినే సీతారం అక్క జయలక్ష్మీ కుమారుడే రవికుమార్.. అలాగే సీతారం భార్య వాణి స్వయానా రవికుమార్ కు అక్క. ఇలా బావ, బావమరిదులు టీడీపీ, వైసీపీ నుంచి ఎన్నికల్లో పోటీపడుతుండడం ఆసక్తి రేపుతోంది.

*ఆముదాలవలస నియోజకవర్గం చరిత్ర:
తమ్మినేని సీతారం 1983,85లల్లో జరిగిన ఎన్నికల్లో తమ్మినేని సీతారం ఘనవిజయం సాధించారు. 1989లో ఓడారు. మళ్లీ 1994,99 లో అదే పార్టీ నుంచి గెలిచారు. 9 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. రవికుమార్ 2014లో టీడీపీ తరుఫున గెలిచి విప్ గా సేవలందించారు.

* బలంగా తమ్మినేని..
2014లో వైసీపీ అభ్యర్థిగా నిలిచిన బావ తమ్మినేనిపై సునాయసంగా బావమరిది రవికుమార్ గెలిచారు. చంద్రబాబు ఆయన్ను ఏకంగా ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి గౌరవించాడు. మంత్రిగా తాను చేసిన అభివృద్ధి.. తమ్మినేని మళ్లీ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లడంతో పోరు ఆసక్తిగా మారింది.

*అనుకూలతలు
-మంత్రిగా చేసిన అనుభవం
-వరుస ఓటములతో సానుభూతి
-మంచి వాగ్ధాటితో ప్రజలకు చేరువ

*ప్రతికూలం
-తరచూ పార్టీలు మారడం మైనస్ గా మారింది
-వివాదాలు మూటగట్టుకోవడం..
-కేడర్ కాపాడుకోలేకపోవడం..
-ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం..

*ఇక అధికార టీడీపీ బలంతో రవికుమార్
అధికార పార్టీలో ఉండడం రవికుమార్ కు కలిసివచ్చే అంశం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం ప్లస్ గా మారింది. తమ్మినేని తో పోల్చితే బావమరిది నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. సంక్షేమ పతకాలు ప్రజలకు చేరువ చేసి వారి మనసు చూరగొన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేసి ప్రభుత్వ పథకాలను అందించడంతో బలంగా నియోజకవర్గ నాయకుడిగా ఎదిగారు..

*అనుకూలం
-అర్హులందరికీ పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరు
-సంక్షేమ పథకాలు చేరువవడం
-ప్రజలకు అందుబాటులో ఉండడం

-ప్రతికూలం
-విమర్శలను తట్టుకోలేకపోవడం
-అన్ని విషయాల్లో దుందుడుకుతనం
-పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తారన్న ఆరోపణలు

*బావ, బావమరుదుల టఫ్ ఫైట్
ఆముదాల వలసలో ప్రభుత్వ బలం, బలంతో రవికుమార్ బలంగా ముందుకు సాగుతుండగా.. అపార రాజకీయ అనుభవంతో బావమరిది తమ్మినేని దూకుడుగా ఉన్నారు. వీరిద్దరు పోరులో గెలుపు ఎవరిదనేది ఆసక్తిగా మారింది. హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తున్న ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది.