Begin typing your search above and press return to search.
హుజూర్ నగర్ లో గెలిచేదెవరంటే?
By: Tupaki Desk | 2 Oct 2019 7:33 AM GMTతెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక హుజూర్ నగర్. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రాతినిధ్యం వహించి రాజీనామా చేసిన ఈ స్థానాన్ని గెలిస్తే కాంగ్రెస్ కుంభస్థలంపై కొట్టినట్టేనని టీఆర్ ఎస్ ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడి సీటును కోల్పోతే పరువుండదని ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు తమ శక్తియుక్తులంతా ధారపోసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు హుజూర్ నగర్ లో టీఆర్ ఎస్ - కాంగ్రెస్ ఫైట్ నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఇక మధ్యలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తీసిపారేయని పరిస్థితి. సో ఈ త్రిముఖ పోరులో గెలుపు ఎవరిదని ‘తుపాకీ డాట్ కామ్’ తాజాగా పోల్ పెడితే వీక్షకులు వినూత్నంగా స్పందించారు.
హుజూర్ నగర్ బరిలో గెలుపు ఎవరిదని పోల్ పెట్టగానే మెజార్టీ ఓట్లు టీఆర్ ఎస్ కు పడ్డాయి. గులాబీ పార్టీ గెలుస్తుందని 37.96 శాతం మంది ఓట్లేశారు. ఇక కాంగ్రెస్ కూడా టీఆర్ ఎస్ కు ధీటుగా పోరాడుతుందని తేలింది. కాంగ్రెస్ గెలుస్తుందని 34.54 శాతం మంది తేల్చిచెప్పారు. దీన్ని బట్టి హుజూర్ నగర్ లో పోరు హోరాహోరీగానే సాగుతుందని అర్థమవుతోంది. గులాబీ - కాంగ్రెస్ పార్టీల మధ్య కేవలం 3 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఇది పెద్ద లెక్కకాదు.. దీంతో ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందనే ఆసక్తి పెరిగిపోతోంది..
ఇక ప్రధాన పోటీదారులైన కాంగ్రెస్ - టీఆర్ ఎస్ లకే కాదు.. కమలం పార్టీకి కూడా 17.93 శాతం మంది ఓట్లేశారు. ఆ పార్టీ కూడా వీలైనంత మెజార్టీ ఓటు షేరింగ్ సంపాదిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక ఈ మూడు పార్టీల గెలుపు అవకాశాలపై అయోమయంలో ఉన్న వారు ఎవరు గెలుస్తారో చెప్పలేం అంటూ 9.57శాతం మంది బదులిచ్చారు.
మొత్తంగా హుజూర్ నగర్ ఎన్నికల్లో గెలుపుపై ఓ అంచనాకు రావడం కష్టంగా మారింది. టీఆర్ ఎస్ - కాంగ్రెస్ పార్టీల మధ్య గెలుపుపై ‘తుపాకీ డాట్ కామ్’ పెట్టిన పోలింగ్ లో స్వల్ప తేడానే ఉండడంతో గెలుపును ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది.