Begin typing your search above and press return to search.
గ్రౌండ్ రిపోర్ట్: 'పాలకొల్లు' ఎవరికి మేలు..!
By: Tupaki Desk | 9 April 2019 2:30 PM GMTఅసెంబ్లీ నియోజకవర్గం : పాలకొల్లు
టీడీపీ: నిమ్మల రామానాయుడు
వైసీపీ: డాక్టర్ బాబ్జి
జనసేన: గుణ్ణం నాగబాబు
పశ్చిమగోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో పాలకొల్లు ఒకటి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకే అనుకూలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నిమ్మల రామానాయుడు.. వైసీపీ అభ్యర్థి ఎం.శేషుబాబుపై గెలుపొందారు. మరోసారి తన సత్తా చాటాలని నిమ్మల రామానాయుడు పోటీలో ఉండగా ఈసారైనా వైసీపీ జెండా ఎగరవేయాలని అభ్యర్థిని మార్చి డాక్టర్ బాబ్జిని వైసీపీ తరుఫున బరిలో ఉంచారు జగన్. 2009లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పోటీ చేసి ఇక్కడ ఓడిపోయారు. కానీ కాపు ఓట్లను చీల్చారు. దీంతో కాపు ఓట్లు తమకే వస్తాయని జనసేన గుణ్ణం బాబును రంగంలోకి దించింది. పవన్ సొంత పుట్టిన ఇలాకా కావడం.. చిరంజీవి ఓడిపోవడంతో పవన్ ఇక్కడ పోటీచేసేందుకు సాహసించలేదు. దీంతో గుణ్ణం బాబు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
* పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం చరిత్ర:
మండలాలు: యలమంచిలి, పాలకొల్లు, పోడూరు
ఓటర్లు: లక్షా 80 వేలు
1955లో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 6, టీడీపీ 6 సార్లు గెలుపొందాయి. సీపీఎం ఒకసారి విజయం సాధించింది. దేశని పెరుమాళ్ల మొదటి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. మొదట కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం ఆ తరువాత టీడీపీకి అనుకూలంగా మారింది. 2009లో పీఆర్‌పీ నుంచి పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఓటమి చెందారు. దీంతో ఈ నియోజకవర్గం పేరు మారుమోగింది.
* నిమ్మల రామానాయుడు మరోసారి అదృష్టం వరించేనా..?
కాపు సామాజికవర్గం అధికంగా ఉండడంతో గత ఎన్నికల్లో జనసేన, బీజేపీలు కలిసి టీడీపీని గెలిపించాయి. దీంతో 2014 ఎన్నికల్లో బరిలో దిగిన నిమ్మల రామానాయుడు ఈజీగా టీడీపీ నుంచి గెలుపొందారు. ఈసారి జనసేన సొంతంగా అభ్యర్థిని బరిలో దిగడం, ఏ పార్టీతో పొత్తు లేకపోవడంతో మరోసారి టీడీపీ గెలుపుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గత ఐదేళ్లలో టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని అంటున్నారు రామానాయుడు. ఆ ధీమాతోనే ప్రజల్లోకి వెళ్లి ఓట్లడుగుతున్నారు.
* అనుకూలతలు:
-టీడీపీ కేడర్ బలంగా ఉండడం
-గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు
-సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం
* అభ్యర్థిని మార్చిన వైసీపీ గెలుస్తుందా?
2014 వరకు టీడీపీలో కొనసాగిన డాక్టర్ బాబ్జీ ఆ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శేషుబాబు ఓడిపోవడంతో ఈసారి డాక్టర్ బాబ్జీకి అవకాశమిచ్చారు జగన్. దీంతో నియోజకవర్గంపై పట్టు సాధించిన బాబ్జి ఈసారి గెలపు తననేదనంటున్నాడు. ఇక టీడీపీ నుంచి బలమైన సామాజిక వర్గం నేత ఉండడంతో బీసీ ఓట్లు తనకే వస్తాయని అంటున్నారు. వైసీపీ గాలి, జగన్ పాదయాత్ర ప్రభావంతో గెలుపుపై ఆశలు పెంచుకున్నారు.
* అనుకూలతలు:
-నియోజకవర్గంపై పట్టు సాధించడం
-గత ప్రభుత్వంపై వ్యతిరేకత
-కాపు సామాజిక వర్గం సపోర్టు
* ప్రతికూలతలు:
-కేడర్ తక్కువగా ఉండడం
-ఎక్కువగా పరిచయం లేని వ్యక్తి కావడం
*టఫ్ ఫైట్ లో గెలుపెవరిది?
2009లో చిరంజీవి పోటీ చేసిన నియోజకవర్గం కావడంతో ఈసారి ఎన్నికల్లో జనసేన కాపు ఓట్లనే నమ్ముకొని గుణ్ణం బాబును బరిలో దించింది. కాపు ఓట్లు అధికంగా తమకే వస్తాయని ఆశాభావంతో ఉన్నారు జనసేన అధినేత పవన్. మరోవైపు సొంత నియోజకవర్గం కావడంతో జనసేనదే గెలుపు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అయితే 2009లో టీడీపీకి ఓట్లు చీలడంతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించినట్లుగా ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేనల మధ్య ఓట్లు చీలి తమ అభ్యర్థి గెలుస్తాడని వైసీపీ భావిస్తోంది. అయితే పశ్చిమ గోదావరిలో పోయిన సారి క్లీన్ స్వీప్ చేసిన బలమైన టీడీపీని ఓడించాలంటే అంత ఈజీ కాదంటున్నారు. మొత్తంగా పాలకొల్లులో ఈసారి త్రిముఖ పోరు రసవత్తరంగా సాగుతోంది.