Begin typing your search above and press return to search.
గ్రౌండ్ రిపోర్ట్: 'పాతపట్నం'.. ఎవరి పట్టం..?
By: Tupaki Desk | 9 April 2019 6:26 AM GMTఅసెంబ్లీ నియోజకవర్గం : పాతపట్నం
టీడీపీ: కలమట వెంకటరమణ
వైసీపీ : రెడ్డి శాంతి
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సార్వత్రిక పోరు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన వెంకటరమణ ఆ తరువాత టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు గురై టీడీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక రాజకీయ నేపథ్యం బలమున్న రెడ్డిశాంతి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. దీంతో ఈ ఇద్దరు బలమైన నేతల మధ్య గెలుపు ఎవరిదనేది ఆసక్తిగా మారింది.
* పాతపట్నం నియోజకవర్గం చరిత్ర:
మండలాలు: మెళియపుట్టి, లక్ష్మినరసుపేట, పాతపట్నం, కొత్తూరు, హీర,
ఓటర్లు: 2 లక్షల 3 వేలు
1952లో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు పాతపట్నం నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వెంకట రమణ టీడీపీ అభ్యర్థి ఎస్. విజయరామారాజుపై విజయం సాధించారు.
* పార్టీ మారిన వెంకటరమణ టీడీపీ జెండాను ఎగురవేస్తారా..?
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కలమట వెంకటరమణ టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. రెండేళ్ల తరువాత టీడీపీలో చేరారు. 2004, 2009లో పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు. దీంతో నియోజకవర్గం మీద పట్టు సాధించడంతో పాటు ప్రజలకు దగ్గరవడంతో ఆయన గత ఎన్నికల్లో గెలుపొందారు. ఇప్పుడు మరోసారి కూడా ప్రజలు తననే గెలిపిస్తారని వెంకరమణ అంటున్నారు. అయితే కొన్ని అభివృద్ధి పనుల్లో కమీషన్లు తీసుకొని పనులు అప్పగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఒక పార్టీ జెండాపై గెలిచి మరోపార్టీలోకి వెళ్లిన వెంకటరమణను ప్రజలు నమ్మరని ప్రతిపక్షాలు అంటున్నాయి.
* అనుకూలతలు:
-సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం
-స్థానికుడు కావడం
-నియోజకవర్గంలో అభివృద్ధి పనులు
* ప్రతికూలతలు:
-టీడీపీ కేడర్ బలంగా లేకపోవడం
-నియోజకవర్గంలో చేసిందేమీ లేదనే ఆరోపణ
*ఎంపీ స్థానం నుంచి అసెంబ్లీ స్థానానికి శాంతి..
రాజకీయ నేపథ్యంలో బలంగా ఉన్న రెడ్డిశాంతి గత ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి గట్టిపోటినిచ్చారు. 75వేల ఓట్లు సాధించారు. కానీ ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో పాతపట్నం నుంచి బరిలో దిగారు. అయితే నియోజకవర్గంలో స్థానికంగా ఉండని రెడ్డిశాంతి గెలిచిన తరువాత కూడా ఢిల్లీలో ఉంటారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కానీ ఈ జిల్లాకు చెందిన తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె అంటున్నారు.
*అనుకూలతలు:
-కేడర్ బలంగా ఉండడం
-జగన్ ఇమేజ్ బలపడడం
-టీడీపీపై వ్యతిరేకత
*ప్రతికూలతలు:
-ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం
-స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం
*టఫ్ ఫైట్ లో గెలిచేదెవరు?
టీడీపీ, వైసీపీ ఇద్దరూ రాజకీయ నేపథ్యం ఉన్న అభ్యర్థులే కావడంతో గెలుపు ఎవరిదో చెప్పడం కష్టంగా మారింది. ఒకరిపై ఒకరు విమర్శలతో ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. టీడీపీ అభివృద్ధి , సంక్షేమంపై టీడీపీ అభ్యర్థి వెంకటరమణ ఆశలు పెంచుకున్నారు. ఇక బలమైన వైసీపీ గాలి, జగన్ పాదయాత్ర వేవ్ తనకు కలిసివస్తుందని వైసీపీ అభ్యర్థి భావిస్తున్నారు. మరి ఐదేళ్లలో వెంకటరమణ చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయా..? లేక జగన్ పై ఉన్న నమ్మకం టీడీపీపై వస్తున్న వ్యతిరేకతతో రెడ్డిశాంతికి అవకాశం ఇస్తారా..? అనేది చూడాలి