Begin typing your search above and press return to search.
గ్రౌండ్ రిపోర్ట్ : పీలేరులో గెలుపెవరివది?
By: Tupaki Desk | 9 April 2019 5:30 PM GMTఅసెంబ్లీ నియోజకవర్గం : పీలేరు
టీడీపీ: నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
వైసీపీ: చింతల రాంచంద్రారెడ్డి
బీజేపీ: నరేంద్రకుమార్ రెడ్డి
చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గం అనగానే గుర్తొకొచ్చేది నల్లారి కుటుంబం. ఈ కుటుంబం నుంచి పోటీ చేసి గెలిచిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తరువాత జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. అయితే ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినా ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తోంది. అయితే ఆయన సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. నల్లారి కిశోర్ రెడ్డికి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరోక్షంగా మద్దతు ఇస్తున్నాడనేది టాక్. ఇక సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి మరోసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి నరేంద్రకుమార్ రెడ్డి బరిలో ఉన్నారు.
*పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం చరిత్ర:
మండలాలు: కలకడ, గుర్రంకొండ, కేవిపల్లి, వాల్మీకిపురం, కలికిరి, పీలేరు
ఓటర్లు: 2 లక్షల 18 వేలు
1952లో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కేఎల్ పీ 2 సార్లు, కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 3 సార్లు విజయం సాధించింది. సీపీఐ, వైసీపీ ఒక్కోసారి గెలుపొందాయి. 2014లో మొదటిసారి వైసీపీ జెండా ఎగరువేసింది.
*రెండోసారి బరిలోకి చింతల రాంచంద్రారెడ్డి.
1994లో టీడీపీ నుంచి పోటీచేసి వాయల్పాడు ఎమ్మెల్యేగా గెలిచిన చింతల రాంచంద్రారెడ్డి 1999లో కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరిన చింతల రాంచంద్రారెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి ఘన విజయం సాధించారు. ప్రతిపక్షం ఎమ్మెల్యే కావడంతో నిధులు విడుదల కాలేదని, దీంతో అభివృద్ధి చేయలేదని రాంచంద్రారెడ్డి అంటున్నారు. అయితే గుర్రంకొండ, కలకడ మండలాల నుంచి ఆయనకు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే కనిపిస్తోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
*అనుకూలతలు:
-పార్టీ కేడర్ బలంగా ఉండడం
-రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం
-రాజకీయ అనుభం
*ప్రతికూలతలు:
-నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం
-ఆసుపత్రి ఆధునీకరణకు నిధులు మంజూరైనా ఎమ్మెల్యే పట్టించుకోలేదనే వాదన
* ఈసారైన కిశోర్ కుమార్ రెడ్డిని విజయం వరించేనా..?
గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన కిశోర్ కుమార్ రెడ్డి ఓటమి చెందారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరారు. కిశోర్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. అలాగే బంధువర్గం కూడా ఎక్కువే ఉంది. అన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయనే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేవారు. ఇవన్నీ ఆయన గెలుపునకు సహకరిస్తాయని అంటున్నారు. పైగా ఈసారి అధికార టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌లో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీ నుంచి పోటీ చేయడం లేదు. దీంతో తన తమ్ముడి కిశోర్ కుమార్ రెడ్డి గెలుపునకు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.
* అనుకూలతలు:
-కిరణ్ కుమార్ రెడ్డి అండదండలు
-సిట్టింగ్ ఎమ్మెల్యేపై వస్తున్న వ్యతిరేకత
-గతంలో కిరణ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు
*ప్రతికూలతలు:
-వైసీపీ కేడర్ బలంగా ఉండడం
-టీడీపీని ఆదరించకపోవడం
*టఫ్ ఫైట్ లో గెలిచేదెవరు?
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రాంచంద్రారెడ్డికి పెద్దిరెడ్డి కుటుంబం అండగా ఉంది. దీంతో ఆయన మరోసారి విజయం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో ఓడిపోయిన కిశోర్ కుమార్ రెడ్డికి సానుభూతి ఓట్లు పడే అవకాశాలున్నాయి. పైగా అధికార టీడీపీ నుంచి దిగడం.. సంక్షేమం, అభివృద్ధి కొండంత అండగా ఉన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కావడం కూడా ప్లస్ అయ్యింది. గెలుపుకోసం వ్యూహం పన్నుతుండడంతో ఇక్కడి అభ్యర్థి గెలుపుపై ఆసక్తి నెలకొంది. ఇలా ఇద్దరు ఉద్దండుల మధ్య విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.