Begin typing your search above and press return to search.
గ్రౌండ్ రిపోర్ట్: 'టెక్కలి' పట్టు సాధించేదెవరో.?
By: Tupaki Desk | 28 March 2019 5:34 AM GMTఅసెంబ్లీ నియోజకవర్గం: టెక్కలి
టీడీపీ: అచ్చెన్నాయుడు
వైసీపీ: పేరాడ తిలక్
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పోటీ చేసిన నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి. సైబీరియా పక్షల వలస కేంద్రమైన టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రిగా ప్రాతినిథ్యం వహించి అచ్చెన్నాయుడు రెండోసారి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి పేరాడ తిలక్ బలమైన అచ్చెన్నాయుడును ఢీకొంటున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి రెండోసారి అవకాశం ఉండదనే సెంటిమెంట్ ఈ నియోజకవర్గంలో పాతుకుపోయింది. ఈ లెక్కన ఈసారి అచ్చెన్నాయుడుకి సెంటిమెంట్ తిరగదొడుతుందా అన్న ఆసక్తి నెలకొంది.
అసెంబ్లీ నియోజకవర్గం టెక్కలి చరిత్ర:
మండలాలు: సంతబొమ్మాలి,కోటబొమ్మాలి, నందిగాం, టెక్కలి
ఓటర్లు: 2లక్షలకు పైగానే
టెక్కలి నియోజకవర్గంలో 1955 నుంచి మొత్తం 15సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. మొదటిసారిగా నరసింహ దొర పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ టీడీపీ ఆరుసార్లు, కాంగ్రెస్ 3సార్గు గెలుపొందాయి. 1994లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలుపొందారు. అయితే ఇక్కడ ఒకసారి గెలిచిన నేత మరోసారి ఓడిపోతాడనే సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ కు అనుగుణంగానే రెండోసారి గెలిచిన రేవతిపతి ప్రమాణస్వీకారం చేయకుండానే మరణించడంతో ఇది బలపడింది.
* బలంగా అచ్చెన్నాయుడు:
రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన అచ్చెన్నాయుడుకు గత ఎన్నికల్లో సానుభూతితో పాటు పవన్ ప్రచారం కలిసొచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాగునీటి సమస్యతో పాటు రోడ్ల నిర్మాణంలో అచ్చెన్నాయుడు చొరవ చూపారు. అయితే ఇచ్చిన హామీల్లో కొన్ని పూర్తి చేయలేదని నియోజకవర్గ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినా అభివృద్ధి విషయంలో పట్టించుకోలేని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు మాటలతో మభ్య పెట్టి ఆ తరువాత మాట మార్చారని అంటున్నారు.
* అనుకూలతలు:
- ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు
- టీడీపీకి బలమైన క్యాడర్
* ప్రతికూలతలు:
-ముందుకు సాగని ఆప్‌షో రిజర్వాయర్ పనులు
-టీడీపీ గ్రామాల్లోనూ అచ్చెన్నాయుడుకు వ్యతితేకత
-హామీల్లో 50 శాతం కూడా నేరవేర్చకపోవడం
* వైసీపీ గాలిలో పేరాడ తిలక్ గెలుపు గుర్రం ఎక్కేనా?
రైతు కుటుంబం నుంచి వచ్చిన తిలక్ పలు ప్రజా ఉద్యమాలు చేశారు. కార్మికుల పక్షాల నిలబడ్డారు. నియోజవకర్గంలో సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. దీంతో ఆయన ప్రజలకు దగ్గరగా చేరుతున్నారు. అచ్చెన్నాయుడుపై తీవ్రంగా వ్యతిరేకత వస్తుండడంతో ఈ పరిస్థితిని ఆయనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. చంద్రబాబు సైతం అచ్చెన్నాయుడిపై అసంతృప్తితో ఉండడంతో ఈసారి తనదే గెలుపని తిలక్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. పైగా స్థానికుడు కావడంతో తిలక్ కు కొండంత బలంగా మారింది. టీడీపీ అచ్చెన్నాయుడుకు ఇదే మైనస్ గా మారింది.
* అనుకూలతలు:
-నందిగాంలో వైసీపీకి పట్టు ఉండడం..ఇప్పుడు నియోజకవర్గం మొత్తం బలపడడం.
-తిలక్ స్థానికుడు కావడంతో మద్దతు
* ప్రతికూలతలు:
-టీడీపీకి కంచుకోట కావడం
-మొదటిసారి బరిలోకి దిగడం
*తిలక్ కే కాస్త మొగ్గు అట..
టీడీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎన్నో హామీలిచ్చి వాటిని నెరవేర్చలేదంటున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వైసీపీ పట్టు కోసం తిలక్ తీవ్రంగా కృషి చేశారు. మరోవైపు ఇక్కడ ఎమ్మెల్యేగా ఒకసారి గెలిస్తే మరోసారి గెలువరనే సెంటిమెంట్ బలంగా ఉంది. దీంతో అచ్చెన్నాయుడు ఓటమి.. తిలక్ గెలిచే అవకాశమున్నట్లు గ్రౌండ్ రిపోర్టులో తేలింది. .