Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'తుని'లో టగ్‌ ఆఫ్‌ వార్‌..!

By:  Tupaki Desk   |   8 April 2019 9:30 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: తునిలో టగ్‌ ఆఫ్‌ వార్‌..!
X
అసెంబ్లీ నియోజకవర్గం: తుని
టీడీపీ: యనమల కృష్ణుడు
వైసీపీ: దాడిశెట్టి రామలింగేశ్వర రావు
జనసేన : రాజా అశోక్‌ బాబు

తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి 2009 వరకు ఆ పార్టీ జెండానే ఎగురవేసింది. టీడీపీలో కీలక నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు ఆ పార్టీ నుంచి 6 సార్లు జయభేరి మోగించి, మంత్రి పదవి చేపట్టారు. అయితే వైఎస్‌ పాదయాత్ర తరువాత 2009లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన రాజా అశోక్‌ బాబు టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన దాడిశెట్టి రాజు గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీ నుంచి యనమల కృష్ణుడు, వైసీపీ నుంచి దాడిశెట్టి రామలింగేశ్వర రావు, జనసేన నుంచి రాజా అశోక్‌బాబు బరిలో ఉన్నారు.

* తుని నియోజకవర్గం చరిత్ర:
మండలాలు: తుని, కోటనందూరు, తొండంగి
ఓటర్లు: 2 లక్షల 3 వేలు

ఈ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్‌ 6 సార్లు, టీడీపీ 6 సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన యనమల రామకృష్ణుడుపై వైసీపీ నుంచి బరిలోకి దిగిన దాడిశెట్టి రాజు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడు టీడీపీ తరుపున 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. కానీ నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.

* వైసీపీ నుంచి మరోసారి రాజా..
వృత్తిరీత్యా వ్యాపార వేత్త అయిన రాజా ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయారంగేట్రం చేశారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన మొదటిసారి పోటీ చేసినా గెలుపొందారు. టీడీపీ, కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత రాజాకు అప్పడు కలిసి వచ్చింది. వైసీపీ అధికారంలో లేకపోయినా సమస్యల పరిష్కారంలో ముందుండేవారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన ఆ సామాజిక వర్గంలో మంచి పేరు ఉంది. అలాగే పార్టీ కేడర్‌ ను బలపర్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.

*అనుకూలతలు:
-పార్టీ అండదండలు
-కాపు సామాజిక వర్గానికి చెందిన నేత
-సొంత ఇమేజ్‌ తో అభివృద్ధి పనులు

* ప్రతికూలతలు:
-కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం
-డ్రైనేజీ సమస్యలను పట్టించుకోకపోవడంతో వ్యతిరేకత

* రెండోసారి యనమల తమ్ముడు..
గత ఎన్నికల్లో పోటీ చేసిన యనమల రామకృష్ణ తమ్ముడు యనమల కృష్ణుడు వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజు చేతిలో ఓడిపోయారు. ఈసారి కచ్చితంగా గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజలు ఈసారి సైకిల్‌ పార్టీని ఆదరిస్తారని దీంతో భారీ మెజారిటీతో గెలుస్తానని అంటున్నారు. అయితే ఆయన అన్న యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవిలో ఉన్నా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న అపవాదు ఉంది. దీంతో టీడీపీని ప్రజలు ఆదరిస్తారా..? అనే చర్చ సాగుతోంది.

అనుకూలతలు:
-టీడీపీ కేడర్‌ బలంగా ఉండడం
-అన్న సపోర్టు పనిచేయడం
-గత ఎమ్మెల్యేపై వస్తున్న వ్యతిరేకత

ప్రతికూలతలు:
-గత ఎన్నికల్లో ఓడిపోవడం
-నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం

*టఫ్ ఫైట్ లో గెలుపు ఎవరిది?
మరోవైపు జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌ బాబు బరిలో దిగారు. దీంతో టీడీపీకి అశోక్‌ బాబు ద్వారా కూడా గట్టపోటీ తగలనుంది. అయితే గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉండడం వలన నిధులు విడుదల కాలేదని, అందువల్ల అభివృద్ధి చేయలేకపోతున్నానని అంటున్నారు. కానీ కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎమ్మెల్యే విఫలమాయ్యరని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే యనమల అన్న రామకృష్ణుడు ప్రభుత్వంలో మంత్రిగా ఉండి చేసిందేమిలేదని కూడా అంటున్నారు. దీంతో ఇక్కడి అభ్యర్థి గెలుపుపై తీవ్ర ఆసక్తి నెలకొంది.