Begin typing your search above and press return to search.
గ్రౌండ్ రిపోర్ట్: 'మార్కాపురం' ఎవరి పరం..?
By: Tupaki Desk | 29 March 2019 7:55 AM GMTఅసెంబ్లీ నియోజకవర్గం: మార్కాపురం
టీడీపీ: కందుల నారాయణరెడ్డి
వైసీపీ: నాగార్జున రెడ్డి
జనసేన: కాశీనాథ్
ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గాల్లో మార్కాపురం ఒకటి. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న ఈ సెగ్మెంట్ లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సార్వత్రిక పోరులో భాగంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు దీనినే ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసింది. కానీ ప్రతిపక్షంలో ఉండడంతో సరైన అభివృద్ధి జరగలేదు. దీంతో టీడీపీ ఈసారి అభివృద్ధి ఎజెండాతోనే ఈ నియోజకవర్గంలో ముందుకెళుతోంది. మరోసారి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, టీడీపీ తరుపున తనను గెలిపిస్తే సమస్యలు తీరుస్తానని కందుల నారాయణరెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇక జనసేన అభ్యర్థి ఈ ఇద్దరి మధ్యలో ఓట్ల చీలికపైనే ఆధారపడ్డారు.
* మార్కాపురం అసెంబ్లీ చరిత్ర
మండలాలు: పొదిలి, తుర్లపాడు, కొనకనమిట్ల, మార్కాపురం
ఓటర్లు: 2 లక్షలు
1955లో నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా 3 సార్లు కాంగ్రెస్, రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. టీడీపీ, వైసీపీ, సీపీఐలు ఒక్కోసారి గెలిచాయి. బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో రెడ్డి, ఎస్సీ, యాదవ, వైశ్య ఓట్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ముస్లింల ఓట్లు అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపున్నాయి.
* కందుల నారాయణరెడ్డి పాగా వేయనున్నారా..?
టీడీపీ నుంచి మూడుసార్లు పోటీ చేసిన కందుల నారాయణరెడ్డి 2009లో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన టీడీపీ నుంచి మరోసారి పోటీ చేస్తుండడంతో సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రెడ్లి సామాజిక వర్గం అధికంగా ఉండడంతో కందులకు కలిసివచ్చే అవకాశం ఉంది. అలాగే వైసీపీ నుంచి ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జెంకె వెంకటరెడ్డికి కాకుండా నాగార్జున రెడ్డికి కేటాయించారు. దీంతో వర్గ పోరు కూడా కందులను గెలిపించే అవకాశాలున్నాయని చర్చించుకుంటున్నారు. అయితే కందులకు మిత్రుడైన కాశీనాథ్ ఆయనను విభేదించి జనసేన నుంచి ప్రత్యర్థిగా మారారు. దీంతో కొన్ని ఓట్లు చీలే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
* అనుకూలతలు:
-సానుభూతి ఓట్లు పడే అవకాశం
-బలమైన ప్రత్యర్థి కాకపోవడం
-పార్టీ బలంగా మారడం
* ప్రతికూలతలు:
-ఆర్థికంగా ప్రత్యర్థి కంటే వీక్ గా ఉండడం
-కాశీనాథ్ జనసేనలో చేరికతో కాపు ఓట్లు చీలే అవకాశం
* వైసీపీ గాలిలో నాగార్జునరెడ్డికి పట్టం కట్టనున్నారా..?
2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసిన జంకె వెంకటరెడ్డి గెలుపొందారు. ఆయన ఎన్నో హామీలు గుప్పించి ఆ ఎన్నికల్లో గట్టెక్కారు. అయితే ఇచ్చిన హామీల్లో కొన్ని నెరవేర్చలేదు. దీంతో ఆయనపై వస్తున్న నిరసనతో పార్టీలోని సీనియర్ నేత కేపీ కొండారెడ్డి కుమారుడు నాగార్జునరెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. దీంతో నాగార్జున రెడ్డి మొదటిసారిగా బరిలోకి దిగుతున్నారు. తండ్రికి ఉన్న పరిచయాలు, బలగమే ఆయనను గెలిపిస్తుందని నమ్ముతున్నారు. కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డికి నాగార్జునరెడ్డి స్వయాన అల్లుడు. ఉడుముల సొంత మండలం కొనకనమిట్ల నాగార్జునరెడ్డి పోటీ చేసే మార్కాపురంలో ఉండడం వలన ఆ మండలం కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
* అనుకూలతలు:
-కేపీ కుటుంబానికి ఆదరణ ఎక్కువ
-బంధువుల సహకారంలో ఓటు బ్యాంకు
-పార్టీ బలంగా ఉండడం
* ప్రతికూలతలు:
-గతంలో వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ప్రభావం
-జంకె సహకారంపై అనుమానం
* విజయం టీడీపీదా.? వైసీపీదా.?
మార్కాపురంలో సమస్యలను పట్టించుకోకపోవడంతో గత ఎమ్మెల్యే జెంకె వెంకటరెడ్డిపై తీవ్ర నిరసన వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గెలిచే అవకాశం లేనందున కేపీ కుటుంబానికి జగన్ టికెట్ కేటాయించారు. దీంతో మరోసారి ఇక్కడ పాగా వేయాలని వైసీపీ భావిస్తోంది. అయితే 2009లో గెలిచి 2014లో ఓడిపోయిన టీడీపీ ఈసారి ఎలాగైనా జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ తరుపున పోటీ చేస్తున్న కందుల నారాయణరెడ్డి శపథం చేస్తున్నారు. మరోవైపు జనసేన నుంచి బరిలోకి దిగిన కాశీనాథ్ సైతం కాపు ఓట్లతో ప్రభావం చూపనున్నారు. దీంతో విజయం టీడీపీ, వైసీపీ మధ్య దోబుచులాడుతోంది.