Begin typing your search above and press return to search.
గ్రౌండ్ రిపోర్ట్: 'నిడదవోలు' దక్కేదెవరికో..?
By: Tupaki Desk | 9 April 2019 9:30 AM GMTఅసెంబ్లీ నియోజకవర్గం: నిడదవోలు
టీడీపీ: బూరుగుపల్లి శేషారావు
జనసేన: జి.శ్రీనివాసనాయుడు
జనసేన: అటికెల రమ్యశ్రీ
పశ్చిమగోదావరి జిల్లాలోని నిడుదవోలు నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బూరుగుపల్లి శేషారావు హ్యాట్రిక్ కోసం మరోసారి టీడీపీ నుంచి బరిలోకి దిగారు. వైసీపీ నుంచి జి.శ్రీనివాసనాయుడు పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి మొదటిసారిగా అటికెల రమ్యశ్రీ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా రైల్వే గేటు సమస్య తీవ్రంగా ఉంది. ప్రతిసారిగా ఎమ్మేల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులు నిడదవోలులో ఆర్వోబీ నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు.. ఆ తరువాత పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి ఈసారి ఎవరి హామీని నమ్ముతారో చూడాలి
* నిడదవోలు నియోజకవర్గం చరిత్ర:
మండలాలు: ఉండ్రాజవరం, నిడదవోలు, పెరవాలి
ఓటర్లు: లక్షా 94 వేలు
అంతకుముందు అత్తిలి నియోజకవర్గంలో ఉన్న నిడదవోలులో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా 2009లో మూడు మండలాలతో నిడదవోలు అవతరించింది. ఇక్కడ రెండు సార్లు ఎన్నికలు జరగగా టీడీపీయే విజయం సాధించింది.
* హ్యాట్రిక్ కోసం శేషారావు తపన
2009, 2014 ఎన్నికల్లో గెలుపొందిన బూరుగుపల్లి శేషారారు ఈసారి కూడా టీడీపీ పార్టీ తరుపునే పోటీ చేస్తున్నారు. అయితే గత పదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదనే ఆరోపణులున్నాయి. చంద్రబాబు పాదయాత్రలో భాగంగా ఇక్కడి వచ్చి ప్రధాన సమస్యగా ఉన్న రైల్వేగేటుపై బ్రిడ్జి నిర్మిస్తామని హామి ఇచ్చారు. అయితే ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కొన్ని చోట్ల అభివృద్ధి పనులు చేశామని శేషారావు చెబుతున్నారు.
* అనుకూలతలు:
-టీడీపీకి కంచుకోట
-రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం
-నియోజకవర్గంలో అభివృద్ధి పనులు
* ప్రతికూలతలు:
-ప్రభుత్వంపై వ్యతిరేకత
-ప్రధాన సమస్యను పట్టించుకోకపోవడం
* జగన్ ఇమేజ్ తో శ్రీనివాసనాయుడు బరిలోకి..
టీడీపీ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతతో పాటు రాష్ట్రంలో జగన్ ప్రభంజనమే తనను గెలిపిస్తుందన్న ధీమాతో మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నారు శ్రీనివాసనాయుడు. యూత్ ఫాలోయింగ్ ఎక్కువ సంపాదించుకున్న ఆయన రెండుసార్లు గెలిచిన శేషారావును ఓడిస్తానని చెబుతున్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న శేషారావు నియోజకవర్గంలో చేసిందేమీ లేదని తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటానని అంటున్నాడు.
* అనుకూలతలు:
-టీడీపీపై వ్యతిరేకత
-యూత్ ఫాలోయింగ్
-జగన్ ఇమేజ్
* ప్రతికూలతలు:
-రాజకీయ అనుభవం లేకపోవడం
-ప్రత్యర్థి బలమైన నేత కావడం
*టఫ్ ఫైట్ లో గెలుపెవరిది?
ఇక జనసేన నుంచి యువ మహిళా అభ్యర్థి అటికెల రమ్య బరిలోకి దిగారు. తనకు ఎన్నికలు మొదటిసారే అయినా పవన్ ప్రభంజనంతో వస్తున్న ఫాలోయింగ్ ఎక్కువగా కలిసివస్తుందని ఆశిస్తున్నారు. టీడీపీకి కంచుకోటగా మారిన ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంపై టీడీపీఅభ్యర్థి గంపెడాశలు పెట్టుకున్నారు. ఇక వైసీపీ గాలి, జగన్ పాదయాత్ర , ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని వైసీపీ అభ్యర్థి ఆశిస్తున్నారు. మొత్తానికి టీడీపీకి కంచుకోటగా ఉన్న నిడదవోలు ఎవరికి దక్కుతుందో చూడాలి.