Begin typing your search above and press return to search.
గ్రౌండ్ రిపోర్ట్: 'రేపల్లె'లో గెలుపెవరిది?
By: Tupaki Desk | 5 April 2019 4:48 AM GMTఅసెంబ్లీ నియోజకవర్గం: రేపల్లె
టీడీపీ : అనగాని సత్యప్రసాద్
వైసీపీ : మోపిదేవి వెంకటరమణారావు
జనసేన : శ్రీ కమతం సాంబశివరావు
గుంటూరు జిల్లాలోని మారుమూల నియోజకవర్గం రేపల్లె. ఓ వైపు సముద్రం, మరోవైపు కృష్ణానది మధ్యలో మడ అడవులతో టూరిజం స్పాట్ ను తలపిస్తుంది. ఇక్కడ రాజకీయం కూడా ఎంతో ఆసక్తి రేపుతోంది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ చేతిలో ఓడిపోయారు. అయితే ఆయన ప్రజల్లో తిరుగుతూ సానుభూతిని సంపాదించారు. దీంతో 2014 ఎన్నికల్లో ఆయనకు నియోజకవర్గ ప్రజలు అండగా ఉండి గెలిపించారు. ప్రస్తుతం ఆయన మరోసారి టీడీపీ తరుపున బరిలో ఉన్నారు. సీనియర్ రాజకీయ నేత, వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన మోపిదేవి వైసీపీ తరుపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఆయన బరిలో నిల్చొని అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
*రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం చరిత్ర:
మండలాలు: నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, రేపల్లె
ఓటర్లు: 2 లక్షల 19 వేలు
స్వాతంత్య్ర అనంతరం ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. ఎక్కువగా కాంగ్రెస్ 6 సార్లు గెలుపొందింది. ఆ తరువాతి స్థానంలో టీడీపీ 5 సార్లు, కమ్యూనిస్టు పార్టీలు రెండుసార్లు జెండా ఎగురవేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్య ప్రసాద్ వైసీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణారావుపై విజయం సాధించారు.
* అనగాని సత్యప్రసాద్ రెండోసారి బరిలోకి..
2009లో ఓడిపోయిన అనగాని ఆ తరువాత ప్రజలతో మమేకమయ్యారు. ఇబ్బందులో ఉన్న వారిని ఆదుకున్నారు. దీంతో ఆయనను 2014 ఎన్నికల్లో గెలిపించారు. అనగాని ఎమ్మెల్యే అయిన తరువాత ఎన్నో అభివృద్ధి పనులు చేశానని చెబుతున్నారు. ఎన్టీఆర్ గృహకల్పనలో భాగంగా చాలా మందికి ఇళ్లు మంజూరయ్యాయి. కొన్ని నిర్మాణం జరుపుకున్నా వాటిలో ఉండలేని పరిస్థితి. ఆ ఇళ్లల్లో కనీస సౌకర్యాలను పట్టించుకోవడంలో ఎమ్మెల్యే నిరాసక్త చూపించారు. దీంతో అనగానిపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.
*అనుకూలతలు:
-నియోజకవర్గంలో ఇబ్బందులున్నవారిని అక్కున చేర్చుకోవడం
-వ్యక్తిగతంగా ఆయనకున్న అభిమానం
-ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం
* ప్రతికూలతలు:
-ఎన్టీఆర్ గృహకల్ప ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు
-అభివృద్ధి పనులు చేపట్టకపోవడం
* మోపిదేవి వెంకటరమణ వైసీపీ నుంచి గెలుస్తాడా..?
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన మోపిదేవి వెంకటరమణ వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. బీసీ నేత అయినా మచ్చలేని నాయకుడిగా మోపిదేవి జీవితాన్ని సాగించారు. అయితే వైఎస్ మరణం తరువాత మోపీదేవికి కష్టాలు మొదలయ్యాయి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో మోపిదేవిని కూడా విచారించడంతో ఆయన కెరీర్ దెబ్బతిందనే చెప్పుకోవాలి. దీంతో ఆయన కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. ఇక్కడైనా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో కనిపించడం లేదని టాక్. అయితే వ్యక్తిగతంగా ఆయన ఎంతో మంచివాడని, గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉంటారనే పేరుంది.
* అనుకూలతలు:
-వ్యక్తిగత ఇమేజ్ బాగా ఉండడం
-గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం
-టీడీపీపై వస్తున్న వ్యతిరేకత
ప్రతికూలతలు:
-జగన్ అక్రమాస్తుల కేసులో విచారణను ఎదుర్కోవడం
-కేడర్ పూర్తిగా డల్ గా ఉండడం
*టఫ్ ఫైట్ లో గెలిచేదెవరు.
ఒకవైపు సీనియర్ రాజకీయ నేత .. మరోవైపు ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుంటున్న నాయకుల మధ్య నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఓడినా కార్యకర్తలతో పాటు జగన్ మేనియాను వివరిస్తూ బలం పెంచుకున్నారు మోపిదేవి. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు సైతం పార్టీలో చేరి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచేలా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అయితే ఈసారి కచ్చితంగా పసుపు జెండానే ఎగురవేస్తామని అనగాని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకముందని ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంపై అనగాని ఆశలు పెట్టుకోగా.. వైసీపీ గాలి, జగన్ పాదయాత్ర, ప్రభుత్వ వ్యతిరేకత గెలిపిస్తుందని మోపిదేవి అంటున్నారు. చూడాలి మరి ఎవరు గెలుస్తారో..