Begin typing your search above and press return to search.
గ్రౌండ్ రిపోర్ట్: 'పోరుగల్లు'లో మెజారిటీ పైనే దృష్టి..!
By: Tupaki Desk | 2 April 2019 5:30 PM GMTపార్లమెంట్ నియోజకవర్గం : వరంగల్
టీఆర్ ఎస్ : పసునూరి దయాకర్
కాంగ్రెస్ : దొమ్మాటి సాంబయ్య
వరంగల్ కు పాతపేరు ఓరుగల్లు. అయితే అది రాను రాను పోరుగల్లుగా ప్రజల్లో నానుతోంది. ఎందుకంటే కాకతీయుల యుద్ధానికి, తెలంగాణ ఉద్యమానికి ఈ ప్రాంతం అండగా నిలిచింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత వరంగల్‌లో టీఆర్ ఎస్ పార్టీ హవా కొనసాగిస్తోంది. కొన్ని స్థానాలు మినహా దాదాపు అన్ని స్థానాల్లో టీఆర్ ఎస్ జెండా రెపరెపలాడుతోంది. సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా టీఆర్ ఎస్ నుంచి రెండోసారి పసునూరి దయార్ పోటీ చేస్తున్నారు. గతంలో రికార్డు మెజారిటీ సాధించిన ఎంపీగా పేరొందిన ఆయన ఈసారి గెలుపు ఖాయమేనని, అయితే మెజారిటీ గతంలో కంటే ఎక్కువస్థాయిలో తీసుకొచ్చేలా కృషి చేస్తున్నామని అంటున్నారు. మరోవైపు మాజీ పోలీస్ అధికారి అయిన దొమ్మాటి సాంబయ్య కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. సుధీర్ఘకాలంగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు. రాష్ట్రంలో రికార్డు మెజారిటీ సాధించిన టీఆర్ఎస్ ఎంపీని కాంగ్రెస్ మాజీ పోలీస్ అధికారి ఢీకొడుతున్నాడు.
* వరంగల్ లోక్ సభ నియోజకవర్గం చరిత్ర:
అసెంబ్లీ నియోజకవర్గాలు: వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి
ఓటర్లు: 16 లక్షల 60 వేలు
1952లో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ లోక్ సభ స్థానానికి 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 7 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ, 3 సార్లు టీఆర్ ఎస్ జెండా పాతింది. 2008 వరకు హన్మకొండ నియోజకవర్గంగా ఉన్న ఈ స్థానంలో ఒకసారి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సైతం విక్టరీ సాధించాడు. 2009లో వరంగల్ లోక్ సభ స్థానంగా అవతరించిన తరువాత ఎస్సీ రిజర్వుడుగా మారింది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరుపున పోటీ చేసిన కడియం శ్రీహరి 3 లక్షల 92 వేల మెజారిటీ సాధించారు. కడియంకు 6 లక్షల 61వేల ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి
సిరిసిల్ల రాజయ్యకు 2 లక్షల 50 వేల ఓట్లు వచ్చాయి.
* పసునూరి దయాకర్ గెలుపు గ్యారెంటీ..
2001 నుంచే టీఆర్ ఎస్ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తున్న పసునూరి దయాకర్ కేసీఆర్ కు విధేయుడుగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు 2015లో జరిగిన ఉప ఎన్నికలో ఆయనకు టికెట్ కేటాయించింది పార్టీ అధిష్టానం. ఈ ఎన్నికల్లో ఆయన 4 లక్షల 59వేల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. టీఆర్ ఎస్ అభ్యర్థుల్లో రికార్డు సృష్టించిన అభ్యర్థిగా దయాకర్ దేశంలో 7వ స్థానంలో నిలిచాడు. అయితే ఎంపీగా ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానంటున్నారు దయాకర్. వరంగల్ నుంచి రెండు కొత్త రైళ్లు, హైవే రహదారుల నిర్మించామంటున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద సీసీ రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాల్స్ నిర్మించామంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ పథకమైన 'హృదయ్' కింద ఎన్నో నిధులు వచ్చినా సరిగా వినియోగించలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే స్మార్ట్ సిటీ జాబితాలో వరంగల్ పేరు వచ్చినా ఎలాంటి అభివృద్ది చేపట్టలేదంటున్నారు.
* అనుకూలతలు:
-రికార్డు మెజారిటీ సాధించిన ఎంపీ కావడం
-భూపాలపల్లి మినహా అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే ఉండడం
-వ్యక్తిగతంగా ఫాలోయింగ్
* ప్రతికూలతలు:
-ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోకపోవడం
-ఎంపీగా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్న ఆరోపణలు
* దొమ్మటి సాంబయ్య టీఆర్ ఎస్ ను ఢీకొంటాడా?
సమర్థ పోలీసు అధికారిగా పేరు తెచ్చుకొని, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు సాంబయ్య. ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ టీడీపీలో కొనసాగారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున పోటీకి దిగుతున్నారు. వరంగల్ లోక్ సభ స్థానం అవతరించిన తరువాత ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన లక్ష ఓట్ల మెజారిటీ సాధించారు. కాంగ్రెస్ కు పరకాల, స్టేషన్ ఘన్ పూర్ లాంటి నియోజకవర్గాల్లో పట్టుంది. ఇక భూపాలపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి కొనసాగుతున్నారు. దీంతో ఆయన ఈసారి ఎలాగైనా గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ ఎస్ ప్రభంజనంలో భూపాలపల్లి సీటును దక్కించుకున్న కాంగ్రెస్ వరంగల్ లోక్ సభ స్థానాన్ని కూడా కైవలం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
*అనుకూలతలు:
-కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచి పట్టు సాధించింది
-సుధీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉండడం
-వ్యక్తిగతంగా సమర్థుడన్న పేరు
* ప్రతికూలతలు:
-టీఆర్ ఎస్ కు కంచుకోట
-ఇటీవలే కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ నాయకులతో సత్సంబంధాలు లేకపోవడం
* గెలుపు టీఆర్ ఎస్ దే.. గట్టి పోటీ ఇస్తాడో లేదో..
రికార్డు మెజారిటీ సాధించిన ఎంపీతో కొత్తగా కాంగ్రెస్ లోకి చేరిన సాంబయ్య ఢీకొడుతున్నాడు. ఒకరకంగా టీఆర్ ఎస్ గెలుపు ఖాయమే కాకపోతే మెజారిటీ మీదనే దృష్టిపెడుతామనంటున్నారు టీఆర్ ఎస్ నాయకులు. మరోవైపు దయాకర్ కు గట్టిపోటీనిచ్చి ఓడిస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకులంతా టీఆర్ ఎస్ లోకి చేరడంతో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో మాత్రమే కొంచెం స్థిరంగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందా..? లేదా ..? శరామామూలుగానే టీఆర్ ఎస్ గెలుస్తుందా అనేది చూడాలి