Begin typing your search above and press return to search.

డబ్ల్యూహెచ్​వో వూహాన్​ యాత్ర.. ఇంతకీ ఏం తేల్చనున్నారు?

By:  Tupaki Desk   |   4 Feb 2021 5:30 PM GMT
డబ్ల్యూహెచ్​వో వూహాన్​ యాత్ర..  ఇంతకీ ఏం తేల్చనున్నారు?
X
కరోనా వైరస్​ వూహాన్​ ల్యాబ్​లోనే పుట్టిందని.. అక్కడి నుంచే ప్రపంచదేశాలకు పాకిందని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను చైనా ఖండిస్తూ వస్తున్నది. అయితే అమెరికా, బ్రిటన్​, ఆస్ట్రేలియా సహా పలుదేశాల శాస్త్రవేత్తలు వూహాన్​ ల్యాబ్​లోనే కరోనా వైరస్​ పుట్టి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు.

మరోవైపు పలువురు జర్నలిస్టులు కూడా అ విషయంపై ఆరోపణలు గుప్పించారు. పలువురు జర్నలిస్టులు ఈ విషయంపై పరిశోధించేందుకు వూహాన్​ వెళ్లగా.. వారిని చైనా ప్రభుత్వం అనుమతించలేదు. ఈ ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూహెచ్​వో బృందం వూహాన్​ వెళ్లింది. కరోనా నిబంధనలతో కొంతకాలం పాటు డబ్ల్యూహెచ్​వో శాస్త్రవేత్తలు క్వారంటైన్​ లో ఉన్నారు. ప్రస్తుతం వారు వూహాన్​లోని వైరాలజీ ల్యాబ్​ను పరిశీలిస్తున్నారు.

బ్యాట్​ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్​ షీ ఝంగ్​లీతో సహా పలువురు చైనా శాస్త్రవేత్తలతో డబ్ల్యూహెచ్​వో బృందం భేటీ అయ్యింది. అయితే షీ ఝంగ్​లీ మాత్రం తొలి నుంచి ఈ ఆరోపణలను తోసి పుచ్చుతున్నారు. కరోనా వైరస్​ వూహాన్​ వైరాలజీ ల్యాబ్​లో పుట్టే అవకాశమే లేదని ఆమె వాదిస్తున్నారు.
వూహాన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీలో సుమారు మూడున్నర గంటల డబ్ల్యూహెచ్​వో శాస్త్రవేత్తలు భేటీ అయ్యారు.

అయితే రెండు వారాలపాటు ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించనున్నది. ‘డాక్టర్​ షీ ఝంగ్​లీలో సహా వుహాన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ శాస్త్రవేత్తలతో అత్యంత కీలక సమావేశం పూర్తయ్యింది. ఆమె కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.’ అని నిపుణుల బృంద సభ్యుడు పీటర్​ డెస్​జాక్​ ట్వీట్​ చేశారు. గబ్బిలాలపై ప్రమాదకరమైన పరిశోధనలు నిర్వహిస్తుండటంతో డాక్ట్​ షీ ఝంగ్​లీకి బ్యాట్​ ఉమన్​గా పేరు వచ్చింది. చైనాలోని వుహాన్​ లెబోరేటరీ 2019 చివరిలో కరోనా వైరస్​ లీకై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందనే ప్రచారం ఉంది. అసలు కరోనా వైరస్​ ఎక్కడ పుట్టింది అన్న విషయంపై ఇంతవరకు క్లారిటీ రావడం లేదు. డబ్ల్యూహెచ్​వో ఏం తేల్చనున్నదో వేచి చూడాలి.