Begin typing your search above and press return to search.
పార్టీ మారినా ఢిల్లీలో 9 మంది గెలిచారు !
By: Tupaki Desk | 12 Feb 2020 8:15 AM GMTఒకప్పుడు రాజకీయాలలో విశ్వసనీయత , విలువలు ఉండేవి కానీ , రానురాను అవి పూర్తిగా తగ్గిపోతున్నాయి. గతంలో ఒక పార్టీ లో హీరోనా నాయకుడు ..తన రాజకీయ ప్రస్థానం ముగించేవరకు అదే పార్టీలో ఉంటూ పార్టీ కి , ప్రజలకి సేవ చేస్తుండేవారు. కానీ , ఈ మధ్య కాలంలో సాయంత్రం ఒక పార్టీలో ఉన్న నేత , తెల్లవారే సరికి మరో పార్టీ జెండా భుజాన వేసుకొని కనిపిస్తున్నాడు. ఏవేవో కారణాలు చెప్పి ప్రజలిచ్చిన తీర్పుని సైతం తుంగలో తొక్కి పార్టీ ఫిరాయింపులకి పాల్పడుతున్నారు. అయితే , అలా పార్టీ ఫిరాయింపుల ద్వారా ఒక పార్టీ లో ఉన్న వారు మరొక పార్టీలోకి వచ్చిన తరువాత కొందరికి మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం వస్తే ..మరికొందరు ఆ అవకాశం రాదు.
ఇకపోతే, ఢిల్లీ అసెంబ్లీ కి పోటీచేయడానికి సొంత పార్టీ టికెట్ ఇవ్వలేదనో , లేక ఆ పార్టీ తరపున పోటీ చేస్తే విజయం దక్కడం కష్టం అనో దాదాపుగా 16 మంది ఎన్నికలకి ముందు పార్టీలు మారి ఎన్నికలలో పోటికిదిగారు. అలా పార్టీ ఫిరాయించిన 16 మంది మరోసారి ఎన్నికల బరిలో నిలువగా కేవలం 9 మంది మాత్రమే విజయం సాధించారు. వారిలో ఎనిమిది మంది అప్ కి చెందిన వారే కావడం విశేషం. మరొకరికి బీజేపీ కి చెందినవారు. ఈసారి ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో ఆప్ 9 మందిని, బీజేపీ నలుగురిని, కాంగ్రెస్ ముగ్గురిని బరిలోకి దించాయి.
ఇకపోతే , ఢిల్లీ రాజకీయాలలో కీలకనేతగా గుర్తింపు తెచ్చుకున్న చాందినీచౌక్ సిట్టింగ్ ఎమ్మెల్యే అల్కా లాంబా ఎన్నికలకి ముందు ఆప్ ను వీడి కాంగ్రెస్ లో చేరి , కాంగ్రెస్ తరపున పోటీలో నిలిచింది. అయితే , కాంగ్రెస్ తరఫున గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆప్ అభ్యర్థి ప్రహ్లాద్ సింగ్ సాహ్నీ చేతిలో ఆమె ఘోరాతి ఘోరంగా ఓడి పోయారు. అల్కాకు కేవలం 3,881 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సుమన్ కుమార్ గుప్తా 29,584 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, అప్ తరపున విజయం సాధించిన ప్రహ్లాద్ సింగ్ కు 50,891 ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే పార్టీలు మారిన ఢిల్లీ నేతలకి ఈ ఎన్నికలు అంతాగా కలిసి రాలేదు అని తెలుస్తుంది.