Begin typing your search above and press return to search.
ఈ 'గెలుపు' ఎవరి ఖాతాలోకి? టీఆర్ ఎస్‌లో చర్చ
By: Tupaki Desk | 7 Nov 2022 4:30 PM GMT''మునుగోడులో టీఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే దత్తత తీసుకుంటా. సిరిసిల్ల మాదిరి అభివృద్ధి చేస్తా. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అభివృద్దిపై సమీక్ష చేస్తా. మాటంటే మాటే'' -ఇదీ మంత్రి కేటీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ. ఈ హామీతోనే ఇక్కడి ప్రజలు కారు గుర్తుకు ఓటేశారని.. ఘనంగా గెలిపించారని టీఆర్ ఎస్‌లో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఇలా ఫలితం వచ్చిందో రాలేదో.. వెంటనే కేటీఆర్ ఫొటోలకు పాలాభిషేకం చేసేశారు.
కట్ చేస్తే.. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. ఆది నుంచి చివరి వరకు ఆయన ప్రతి మండలాన్నీ చుట్టేశారు. ప్రతి ఇంటినీ చుట్టేశారు. నాయకులను కదిలించారు. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు.
కూసుకుంట్లను గెలిపించాలని.. అభివృద్ధికి తాను హామీ ఇస్తున్నానని.. కేసీఆర్ మాట ఇదేనని.. జగదీష్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే.. ఫలితం వెలువడిన తర్వాత.. కొద్ది మంది ఆయన అభిమానులు మాత్రమే జగదీష్‌రెడ్డిని తలుచుకున్నారు. ఈ నేపథ్యంలో 'మునుగోడు విజయం' ఆది నుంచి కష్టించిన జగదీష్ రెడ్డి ఖాతాలో పడుతుందా? దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ ఖాతాలోకి చేరుతుందా? అనేది ఆసక్తిగా మారింది.
జనం మాటేంటంటే! సీఎం కేసీఆర్‌కు అనుంగ శిష్యుడిగా పేరొందడమే కాకుండా పార్టీ ఆవిర్భావ కాలం నుంచి ఆయన వెంటే ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంత్రి జగదీష్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ఎమ్మెల్యే లతో పాటు ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులను సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీని పటిష్ఠం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుంటూ అక్కడి ప్రజలకు కావల్సిన పథకాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు వంటి అమలు చేస్తూనే మరోవైపు పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసుకుంటూ నిత్యం ప్రజలతో, పార్టీ శ్రేణులతో మమేకమవుతూ వస్తున్నారు.
కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఉప ఎన్నికలు వచ్చిన సమయంలో ఆపరేషన్ ఆకర్ష్ వంటి కార్యక్రమాలతో మైండ్ గేమ్ ద్వారా ఎదుటి పార్టీకి ప్రజాప్రతినిధులు లేకుండా చేయడమే కాకుండా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కనీసం ఎజెంట్లు కూడా దొరకని విధంగా ఎత్తులు వేస్తూ వ్యూహంతో ముందుకు సాగుతూ ఉప ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. ఉప ఎన్నిక లు వచ్చిన సమయంలో తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు ఉప ఎన్నికల ప్రాంతాల్లో వారికి అన్ని సౌకర్యాలు కల్పించి పార్టీ గెలుపునకు వారు సహకరించేలా చూసుకుంటూ ఉప ఎన్నికలో కారు హవా సాగేలా చూశారు.
కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలోనే దిగ్గజాలుగా పేరొందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీలో చేరి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని వరుసగా ఉప ఎన్నికలో కనుమరుగు చేసి రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి గుర్తింపు సాధించారని తల పండిన రాజకీయ వర్గాలు, ప్రజలు కూడా చెబుతున్నారు.
సో.. ఈ పరిణామాలను బట్టి.. ఖచ్చితంగా మునుగోడు విజయం మంత్రి జగదీష్ ఖాతాలోనే పడుతుందని అంటున్నారు. చివరకు కేసీఆర్ ఎలా నిర్ణయిస్తారో చూడాలి. ఏదేమైనా టీమ్‌ను నడిపించడంలో జగదీష్ భేష్ అనే మాట వినిపిస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.