Begin typing your search above and press return to search.

జయ మాస్టర్ మైండ్స్ వీరేనా?

By:  Tupaki Desk   |   20 May 2016 9:15 AM GMT
జయ మాస్టర్ మైండ్స్ వీరేనా?
X
చరిత్రను తిరగరాసే అవకాశం చాలా తక్కువ మందికి తక్కువసార్లు మాత్రమే లభిస్తుంది. తాజాగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అలాంటి దక్కింది. మూడు దశాబ్దాలకు పైగా సాగుతున్న రికార్డును బ్రేక్ చేయటంలో ఒక ఆనందమైతే.. వరుసగా రెండోసారి పవర్ చేతికి రావటం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. అందుకే అంత పెద్ద అమ్మ సైతం తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నట్లుగా ఆమె చెప్పుకున్నారు. ఆచితూచి పొదుపుగా మాట్లాడే జయలలిత నోటి వెంట ఈ తరహా మాట రావటం చూసినప్పుడు.. ఆమె ఎంత సంతోషంతో ఉన్నారో అర్థమవుతుంది.

మరి.. జయలలితకు ఈ విషయం ఉత్తినే వచ్చేసిందా? ఆమె విజయానికి దిశానిర్దేశం చేసిన వారెవరు? అమ్మకు మాస్టర్ మైండ్ గా ఉండేవారెవరన్నఅంశాన్ని చూస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. అమ్మ వెంట పెద్ద ఎత్తున రాజకీయ నేతలు ఉన్నా.. వ్యూహకర్తల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవటం గమనార్హం. అమ్మకు మాస్టర్ ఐడియాలు ఇచ్చేది ఆరుగురు సీనియర్ అధికారులుగా చెబుతారు. వారిలో ముగ్గురు ఐఏఎస్లు కాగా.. మరో ముగ్గురు ఐపీఎస్ లుగా చెబుతారు. వీరిలో ప్రస్తుతం పని చేస్తున్న వారితో పాటు.. మాజీలు కూడా ఉండటం గమనార్హం.

ఇంతకీ ఆ ఆరుగురు ఎవరంటే.. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయి ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా పని చేస్తున్న షీలా బాలకృష్ణన్.. తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి.. మరో మాజీ ఐఏఎస్ లతో పాటు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ (ఏడీజీపీ)లతో పాటు ఒక రిటైర్డ్ డీజీపీ ఉండటం గమనార్హం.

ఈ ఆరుగురు అధికారులతో జయలలిత క్లోజ్ ఫ్రెండ్ శశికళ నిత్యం టచ్ లో ఉండి.. వారికి సలహాలు.. రాజకీయ వ్యూహాలు చర్చిస్తుంటారట.పార్టీలో అంతమంది రాజకీయ నాయకులున్నా.. అమ్మకు ఈ ఆరుగురి టీం మీదనే ఎక్కువ గురిగా చెబుతున్నారు.