Begin typing your search above and press return to search.

మహిళలు, పురుషులు.. ఎవరి మెదడు చురుకు?

By:  Tupaki Desk   |   18 Oct 2022 11:30 PM GMT
మహిళలు, పురుషులు.. ఎవరి మెదడు చురుకు?
X
స్త్రీ, పురుషుల్లో తెలివితేటలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి. ఎవరు తెలివిలో తోపు అంటే అందరూ మగాళ్లే అనుకుంటారు. కానీ సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పురుషుడు శారీరకంగా బలవంతుడు అయితే స్త్రీలు మానసికంగా శక్తివంతురాలు అని అంటారు. ఏదైనా విషయం ఆలోచించడంలో కూడా పురుషుల కంటే ఆడవారి ఒక అడుగు ముందుంటారన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆడవారి జ్ఞాపకశక్తి మీద చేసిన ఒక పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పురుషుల్లో కంటే మహిళల మెదడు వేగంగా.. చురుకుగా ఉంటుందని నార్వేకు చెందిన పరిశోధకులు తేల్చారు. అంతేకాదు.. మహిళలు 50 ఏళ్ల క్రితం నాటి పదాలను గుర్తుంచుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారని శాస్త్రజ్ఞులు చెప్పారు.

నార్వేలోని బెర్గెన్ యూనివర్సిటీలో నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పరిశోధన కోసం ఈ బృందం పురుషులు, మహిళల మానసిక నైపుణ్యం తెలుసుకోవడం కోసం గతకొన్ని సంవత్సరాల నుంచి డేటా సేకరించారు. ఈ డేటాను విశ్లేషించారు. ఈ మెటా విశ్లేషణలో దాదాపు 3.50 లక్షల మంది డేటాను తీసుకున్నారు. ఇప్పటివరకూ నిర్వహించిన డేటా రీసెర్చ్ లో మహిళలకు అనర్ఘళంగా మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.

స్త్రీలు, పురుషుల కంటే మెరుగైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారని తేలింది. ఒక నిర్ధిష్ట అక్షరం లేదా వర్గంతో ప్రారంభమయ్యే పేర్లు, పదాలను కనుగొనడంలో లేదా గుర్తుంచుకోవడంలో మహిళలు మెరుగైన స్థానంలో ఉన్నారు. మేధో నైపుణ్యాల విషయంలో స్త్రీలు,పురుషుల మధ్య ఎలాంటి తేడా లేదని పరిశోధకులు తెలిపారు.

మహిళల్లో మెదడులోని కార్టెక్స్, లింబిక్ వ్యవస్థలో ఎక్కువ రక్తప్రవాహం ఉంటుంది. దీనివల్ల పురుషుల మెదడు కంటే స్త్రీల మెదడు చురుకుగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. అంతేకాదు వాసనలు గుర్తు పెట్టుకోవడం వంటి ఇంద్రియ శక్తి కూడా మహిళల్లో అధికమని అధ్యయనంలో తేలింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.