Begin typing your search above and press return to search.

ఎవ‌రు అడిగార‌మ్మా నీ మ‌ద్ద‌తు ?

By:  Tupaki Desk   |   9 Dec 2018 12:02 PM GMT
ఎవ‌రు అడిగార‌మ్మా నీ మ‌ద్ద‌తు ?
X
తెలుగు రాజ‌కీయ నేత‌ల్లో ఏ మాత్రం సిగ్గు మొహమాటం లేని ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కురాలు అని పురంధేశ్వ‌రిని అన‌డంలో ఏ మాత్రం సందేహించాల్సిన అవ‌స‌రం లేదు. చంద్ర‌బాబు కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకుని ఎన్టీఆర్‌ ను ఎంత అవ‌మానించారో, నందమూరి రామారావు కూతురు అయిన ఆమె కాంగ్రెస్ లో చేర‌డం ద్వారా ఎన్టీఆర్‌ ను అంతే అవ‌మానించింది. పైగా రాష్ట్రం కోసం ఎన్టీఆర్ ఇందిర‌నే ఎదిరిస్తే... స‌రిగ్గా దానికి రివ‌ర్సులో అచ్చం చంద్ర‌బాబు లాగే త‌న పొలిటిక‌ల్ కెరీర్ కోసం రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ణంగా పెట్టి విభ‌జ‌న స‌మ‌యంలో నిస్స‌హాయంగా మిగిలిపోయిందామె.

స‌రిక‌దా... చంద్ర‌బాబు కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్‌ ను అవ‌మానిస్తావు అంటూ విమ‌ర్శ‌లు చేసింది. ఆ విమ‌ర్శ‌కు చంద్ర‌బాబు అర్హుడే కానీ ఆ విమ‌ర్శ చేయ‌డానికి పురంధేశ్వ‌రి ఏమాత్రం అర్హురాలు కాదు. కానీ ఆ కామెంట్ నిస్సిగ్గుగా ఆమె ప‌దేప‌దే చేశారు. తాజాగా ఆమె మ‌రోసారి మొహమాటం లేకుండా, పిలవ‌ని పేరంటానికి వెళ్లిన‌ట్లు... కేసీఆర్ అడ‌క్కుండానే పోలోమంటూ కేసీఆర్‌కు మ‌ద్ద‌తిస్తాం అన్నారు. త‌ద్వారా చంద్ర‌బాబులానే మ‌రోసారి ఆంధ్ర‌కు ఆమె వెన్నుపోటు పొడిచారు. కేసీఆర్ అడ‌గ‌ని మ‌ద్ద‌తును ఈమే ప్ర‌క‌టించి పైగా ష‌ర‌తులు పెడుతుంది. ఇంత‌కంటే అప‌హాస్య‌మైన రాజ‌కీయం ఏమైనా ఉంటుందా?

మజ్లిస్ పార్టీని దూరంగా పెడితేనట‌... ఆమె గారు తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ కు మ‌ద్ద‌తు ఇచ్చి ఆయ‌న‌ గారిని ముఖ్య‌మంత్రిని చేస్తార‌ట‌. ఇదీ ఆమె నీతి. అస‌లు కేసీఆర్ గాని, టీఆర్ఎస్ నేత‌లు గాని ఆమెను మ‌ద్ద‌తు అడ‌గ‌నే లేదు. బీజేపీని కోర‌నే లేదు. కానీ ఎగేసుకుంటూ కేసీఆర్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి రెడీ అనేసింది. ఇదీ ఆమె వ్య‌వ‌హారం. అందుకే ఆమె పై ఆంధ్రులు *ఎవ‌రు అడిగార‌మ్మా నీ మ‌ద్ద‌తు* అంటూ పాడుకుంటున్నారు!