Begin typing your search above and press return to search.

66 ఏళ్ల మాజీ క్రికెటర్ రెండో పెళ్లి ఎందుకింత వైరల్?

By:  Tupaki Desk   |   26 April 2022 12:30 PM GMT
66 ఏళ్ల మాజీ క్రికెటర్ రెండో పెళ్లి ఎందుకింత వైరల్?
X
అరుణ్ లాల్ గుర్తున్నారా? క్రికెట్ ను అమితంగా ప్రేమించి.. అభిమానించే ఇప్పటి తరానికి ఆయన పేరు.. ఆయన వీరోచిత ఇన్నింగ్స్ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ.. 60 నుంచి 80 తొలినాళ్లలో పుట్టిన వారందరికి మాత్రం ఈ మాజీ ఓపెనర్ బాగానే తెలుసు. అలాంటి ఆయన తన 66 ఏళ్ల పెద్ద వయసులోరెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ న్యూస్ వైరల్ గా మారటమే కాదు.. అందరూ మాట్లాడుకునేలా మారింది. దీనికి బోలెడన్ని కారణాలు.

అందరిని ఆకర్షిస్తున్న అంశం.. అరుణ్ లాల్ తన రెండో పెళ్లిని.. తన కంటే 28 ఏళ్లు చిన్నదైన బుల్ బుల్ సాహాను మే 2న పెళ్లాడనున్నారు. కోల్ కతా వీరి పెళ్లికి వేదిక కానుంది. మాజీ క్రికెటర్ అయిన బుల్ బుల్ సాహాతో అరుణ్ లాల్ సుదీర్ఘకాలంగా సహజీవనం చేస్తున్నారు.

మరి.. ఆయన మొదటి భార్య సంగతేంటి? అన్న ప్రశ్న మదిలో మెదిలితే మీకు నమ్మలేని అంశం ఒకటి కనిపిస్తుంది. ఆయన మొదటి భార్య పేరు రీమా. ఆమెతో అరుణ్ లాల్ ఎప్పుడో విడాకులు తీసుకున్నారు. సాధారణంగా భార్యతో బంధం తెగిపోతే ఎవరి దారి వారిది అన్నట్లు ఉంటారు. కానీ.. అరుణ్ లాల్ విషయం మాత్రం అందుకు భిన్నం.

విడాకులు తీసుకున్న తర్వాత రీమా ఆరోగ్యం దెబ్బతినటం.. ఆమె అనారోగ్యం పాలు కావటంతో ఆమెను తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అసలేమాత్రం బాగోలేదని.. విషమంగా ఉందని చెబుతున్నారు.

విడాకుల తర్వాత కూడా ఆమె ఆరోగ్య సరిగా లేకపోవటంతో ఇంట్లోనే ఉంచి సపర్యలు చేస్తూ.. ఒక స్నేహితుడి మాదిరి నిలిచారు. క్రికెటర్ గా రిటైర్ అయ్యాక ఆయన.. దేశవాళీ.. అంతర్జాతీయ మ్యాచ్ లకు కామెంటేటర్ గా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు. 2016లో దవడ కేన్సర్ బారిన పడటంతో ఆయన కామెంట్రీకి గుడ్ బై చెప్పేశారు. దాని నుంచి కోలుకున్న తర్వాత బెంగాల్ రంజీ కోచ్ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సుదీర్ఘకాలంగా బుల్ బుల్ సాహాతో రిలేషన్ షిప్ లో ఉన్న మదన్ లాల్.. ఆ విషయాన్ని దాచటానికి అస్సలు ప్రయత్నించలేదు. బుల్ బుల్ విషయానికి వస్తే ఆమె కూడా క్రికెటర్ అయినప్పటికీ టీచర్ గా పని చేస్తుంటారు. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ గత నెలలోనే జరిగింది. తాజాగా హల్దీ ఫంక్షన్ జరగటం.. దీనికి సంబంధించిన వివరాల్ని మీడియాకు రావటంతో.. వీరి పెళ్లి వార్త అందరికి తెలిసిందే. తాజాగా తన రెండో పెళ్లిని కూడా తన మాజీ భార్య అనుమతితోనే పెళ్లాడనుండటం గమానార్హం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. 38 ఏళ్ల బుల్ బుల్ సాహాకు ఇదే మొదటి పెళ్లిగా చెబుతున్నారు.