Begin typing your search above and press return to search.

మ్యాప్ లో అమరావతి ఎందుకు మిస్సైంది..?

By:  Tupaki Desk   |   7 Nov 2019 6:21 AM GMT
మ్యాప్ లో అమరావతి ఎందుకు మిస్సైంది..?
X
పార్లమెంట్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తీసేసిన కేంద్రం తాజాగా అధికారికంగా జమ్మూకాశ్మీర్ ను విభజించిన సంగతి తెలిసిందే. జమ్మూకాశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన రాష్ట్రాలుగా మనుగడలోకి తీసుకొచ్చింది.. ఈ మేరకు నోటి ఫై చేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే భారత దేశ చిత్రపటం లోనూ మార్పులు చేసింది. జమ్మాకాశ్మీర్, లఢక్ రాష్ట్రాలుగా విభజించింది. ఈ కొత్త మ్యాప్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వివాదానికి ఆజ్యం పోసింది.

*ఏపీ రాజధాని గల్లంతు..
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన తాజా మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించకపోవడం వివాదానికి దారి తీసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల రాజధానులను గుర్తించిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు మాత్రం రాజధాని లేకుండానే మ్యాప్ ను విడుదల చేయడం దుమారం రేపింది. దీన్ని తీవ్ర అవమానంగా ఏపీ ప్రజలు, నేతలు భావిస్తూ అక్కసు వెళ్లగక్కుతున్నారు. మీ వల్లే మీ వల్లేనంటూ కారణాన్ని అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారు.

* అమరావతికి చోటెందుకు దక్కలేదు.?
జమ్మూకాశ్మీర్, లఢక్ రాష్ట్రాలుగా విడిపోయాక తాజాగా విడుదలైన భారతదేశ చిత్రపటంలో ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిని కేంద్రం గుర్తించకపోవడానికి కారణం ఎవరు అన్న ఇప్పుడు తలెత్తోంది. అయితే అమరావతిని కేంద్రం గుర్తించకపోవడానికి మాజీ సీఎం చంద్రబాబే కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

*అమరావతి నోటిఫై కాకపోవడానికి ప్రధాన కారణాలివే..
2015 అక్టోబర్ 2న ఏపీ రాజధానికి ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఏపీ రాజధాని కోసం 33వేల ఎకరాలను సేకరించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వెలగపూడిలో నిర్మించిన సచివాలయం, హైకోర్టు రెండూ తాత్కాలిక మైనవి అనే కేంద్రానికి సమాచారం అందించిందట.. అధికారికంగా రాజధాని అమరావతిలో ఏ భవనం కూడా లేదు. ఉన్న భవనాలన్నీ తాత్కాలిక నిర్మాణాలే.. అమరావతిని రాజధానిగా చంద్రబాబు నోటిఫై చేయలేదు. కేంద్రానికి ప్రతిపాదన పంపలేదు. సర్వే ఆఫ్ ఇండియాకు చంద్రబాబు ఏపీకి రాజధాని అమరావతి అని అధికారిక సమాచారం ఏదీ పంపకపోవడం కూడా కేంద్రం గుర్తించకపోకపోవడానికి కారణంగా చెబుతున్నారు.

ఇక రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నాడు చంద్రబాబు సర్కారుకు ఇచ్చిన నిధుల లెక్కలు కూడా చెప్పలేదు. నిధుల వినియోగం పత్రం కూడా కేంద్రానికి సమర్పించలేదు.

మరో ముఖ్య విషయం ఏంటంటే ఏపీ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు ఏపీ, తెలంగాణకు హైదరాబాదే ఉమ్మడి రాజధాని అట.. సో కేంద్రం ఇలా ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించకపోవడానికి చంద్రబాబు చేసిన తప్పులతో పాటు విభజన చట్టం కూడా కారణమన్న వాదన వినిపిస్తోంది.