Begin typing your search above and press return to search.
టీడీపీ విమర్శిస్తుంటే.. జగన్ మంత్రి ఎక్కడున్నారో!
By: Tupaki Desk | 3 Aug 2019 6:44 AM GMTపోలవరం కాంట్రాక్టు వ్యవహారాల నుంచి నవయుగ సంస్థను తప్పించడంపై టీడీపీ ఫైర్ అవుతూ ఉంది. తాము నియమించిన కాంట్రాక్టు సంస్థను జగన్ ప్రభుత్వం తప్పించిందని అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఒకరి తర్వాత మరొకరు ఆ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి ఈ విషయంలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిస్పందన మాత్రం అంత ఘాటుగా లేదు.
ప్రత్యేకించి సాగునీటి వ్యవహారాల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు స్పందించకపోవడం విశేషం. తెలుగుదేశం నేతలు శుక్రవారం రోజున వరసగా ప్రెస్ మీట్లు పెట్టారు. దేవినేని ఉమ- బుచ్చయ్య చౌదరిలతో పాటు అచ్చెన్నాయుడు కూడా ఈ అంశంపై స్పందించారు.
ఇక తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ఈ వ్యవహారాన్ని ఎత్తారు. కేంద్రం స్పందనను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పెయిడ్ విభాగాలు హైలెట్ చేస్తూ ఉన్నాయి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు మాత్రం స్పందించడం లేదు. తెలుగుదేశం ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తుంటే..వైసీపీ మాత్రం నిమ్మకు నీరెత్తింది.
తెలుగుదేశం పార్టీ మీద తీవ్రంగా విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు అస్సలు స్పందించలేదు. దేవినేని ఉమకు కౌంటర్ గా ప్రెస్ మీట్ శుక్రవారమే పెట్టాల్సింది. అయినా మంత్రి స్పందించడం లేదు. మరి ఈ అంశాన్ని వైఎస్సార్సీపీ లైట్ తీసుకుంటోందా.. తెలుగుదేశం అక్రమాలను కడిగేయడానికి ఇప్పుడు అవకాశం ఉన్నా ఎందుకు స్పందించనట్టు?