Begin typing your search above and press return to search.
కరోనా అంటే ఏపీకి భయం లేదా..!
By: Tupaki Desk | 18 March 2020 9:55 AM GMTకరోనా.. ఈ పేరు వింటేనే దేశంలోని రాష్ట్రాలన్నీ వణికి చస్తున్నాయి. కరోనా వైరస్ కి భయపడే దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో సినిమా థియేటర్లను మూసివేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. తెలంగాణాలో అయితే ఈ నెల 31వరకు సినిమా థియేటర్లు - స్కూల్స్ - మాల్స్ మూసేయాలని హుకుం జారీచేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లు మూతపడి మూడు రోజులవుతుంది. జనాలు కూడా పెద్దగా బయట తిరగడం మానేశారు. కానీ అన్ని రాష్ట్రాలు కరోనా నుండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో అని కంగారు పడుతుంటే..
ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మా రాష్ట్రంలో కరోనా ఉనికి లేదంటూ చెప్పడం తో దేశం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది అంటే నమ్మక తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో కరోనా లేదు ఏం లేదు భయపడకండి అంటుంది. ఏపీ లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు మాత్రమే నమోదవడం తో రాష్ట్ర ప్రభుత్వం చీకుచింతా లేకుండా ఉన్నట్లు అన్పిస్తుంది. అందుకే ఏపీలో ఇంతవరకు సినిమా థియేటర్లను, స్కూళ్లను మూయించలేదు. అయితే ఒకే ఒక్క కేసు నమోదైన నెల్లూరు జిల్లాలో మాత్రం సినిమా హాళ్లను మూసివేయాలని కలెక్టర్ ఆర్డర్ చేసారు.
అదేవిధంగా తాజాగా రాష్ట్రంలోని సినిమా హాళ్ళన్నీ స్వచ్చందంగా మూసివేయాలని గోదావరి జిల్లా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చినట్లు సమాచారం. రేపటి నుండి ఏపీ లో కూడా మార్చి 31వరకు సినిమా హాళ్లు మూతపడనున్నాయి. ప్రస్తుతం సినిమాలకు ఆదరణ లేక కొత్త సినిమాలు విడుదల గాక ఖాళీగా ఉంచడం ఎందుకని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అసోసియేషన్ తెలిపింది. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించక పోవడం తో రాష్ట్ర ప్రజలు - ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచనలో పడ్డాయి.