Begin typing your search above and press return to search.
ఎంప్లాయీస్ రాజకీయ స్పీచులు ఎందుకు ఇస్తున్నారు... ?
By: Tupaki Desk | 13 Dec 2021 8:00 PM ISTఏపీలో ఎంప్లాయీస్ రచ్చ ఎక్కువ అయిపోతోంది. వాళ్ళ సమస్యల కంటే కూడా వచ్చే ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామని అనే వరకూ కధ వెళ్ళిపోయింది అంటే ఉద్యోగులు రాజకీయాలు మాట్లాడవచ్చునా అన్న చర్చ అయితే అంతటా సాగుతోంది. తమ సమస్యలు ఏమైనా ఉంటే దాని మీద స్పీచులు ఇస్తే ఇవ్వవచ్చు, అది సబబు, ఎంత చెప్పుకున్నా వారి సమస్యల మీద మాట్లాడడాన్ని ఎవరూ తప్పు పట్టే ప్రసక్తి అసలు ఉండదు.
కానీ ఫలానా వాళ్ళను మేము ఓడించామని, మరోకళ్ళను గెలిపించామని వాళ్ళు చెప్పుకోవడం చూస్తూంటే మరి ప్రజల ఓట్లకు విలువ ఉందా అన్న సందేహం వస్తోంది. ప్రజలు కోట్లాది మంది ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. కానీ మేమే అంతా అని ఉద్యోగులు గట్టిగా సౌండ్ చేస్తున్నారు అంటేనే రాజకీయ విడ్డూరంగా చూడాలి మరి.
ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో అతి ముఖ్యమైన భాగం. వారు తమకు ఎవైనా ఇబ్బందులు ఉంటే దానిని హైలెట్ చేస్తూ మీడియాకు ఎక్కడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అది కూడా వారి పరిధులు, పరిమితుల మేరకే మాట్లాడుతూ ఉంటారు. కానీ వారు రాజకీయాలు మాట్లాడేస్తున్నారు. దాంతో ఇలాంటివి టచ్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది అన్న చర్చ అయితే అంతటా ఉంది.
ఉద్యోగులు ఇవీ మా సమస్యలు, ప్రభుత్వం ఇలా హామీ ఇచ్చింది. వాటిని అమలు చేయడంలేదు, దాని వల్ల మాకు ఉన్న బాధలు ఇవీ అని చెప్పుకుంటే ప్రజా బాహుళ్యంలోకి అవి వెళ్ళి మద్దతు ఏమైనా వస్తుంది. కానీ రాజకీయ నాయకుల మాదిరిగా మేము 13 లక్షల మందిమి ఉన్నామని , ఇంట్లో వారికి కలుపుకుంటే 60 లక్షల ఓట్లు పక్కాగా మాకు ఉన్నాయని చెప్పడంలో అర్ధాలు పరమార్ధాలు ఏంటి అన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
నిజానికి ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో జీతాలు వస్తున్నాయి. బడ్జెట్ లో కూడా భారీగానే వారికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. సరే వారు ప్రభుత్వ యంత్రాంగంలో భాగం, కీలక భూమికని నిర్వహిస్తున్నారు కాబట్టి వారి విషయంలో కొంత వరకూ జనాలు చూసీ చూడనట్లుగా ఉంటారు. అయితే వారు మరీ గొంతెమ్మ కోరికలు కోరడం చేస్తే చులకన అవుతారు. అంతే కాదు, రాజకీయాలు మాట్లాడుతూ పోతే ఉన్న కొద్ది పాటి సానుభూతి కూడా ఉద్యోగులు కోల్పోతారని అంటున్నారు.
ఇక ఏపీలో ఆర్ధిక పరిస్థితి మీద సామాన్యులకు కూడా అవగాహన ఉంది. ప్రభుత్వం అప్పులను చేస్తూ కధ నడుపుతోంది. అభివృద్ధి కూడా నిధులు లేని పరిస్థితి అయితే చాలానే ఉంది. ఈ నేపధ్యంలో అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది అన్న మాట కూడా ఉంది. మరి పట్టు బట్టి డిమాండ్ చేస్తే ఇంకా ఉద్యోగ వర్గాలు సానుభూతిని జనాలలో కోల్పోతారు. అది చాలదన్నట్లుగా మేమే అంతా అంటూ లేని పోని రాజకీయాలను కూడా తెచ్చి అనవరమైన విషయాలుగా మాట్లాడితే వారికే చివరికి ఇబ్బందిగా మారుతుందన్న సూచనలూ ఉన్నాయి.