Begin typing your search above and press return to search.
ఎంఎల్ఏలు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు ?
By: Tupaki Desk | 13 Jan 2022 5:04 AM GMTఇదే ఎవరికీ అర్థం కావటం లేదు. ఒక వైపేమో రాబోయే ఎన్నికల్లో బీజేపీయే మళ్ళీ అధికారంలోకి రావటం ఖాయమని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ నేతలు కూడా తాము అధికారంలోకి వచ్చేసినట్లే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే ఇదే సమయంలో బీజేపీ నుంచి మంత్రులు, ఎంఎల్ఏలు రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నారు. ఈ రెండు అంశాలను చూస్తే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఈ విషయంలోనే అందరిలోను అయోమయం పెరిగిపోతోంది.
తాజాగా చేసిన సర్వేలో కూడా 257 సీట్లతో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని టౌమ్స్ నౌ ప్రకటించింది. ఇదే కనుక నిజమైతే బీజేపీ నుంచి ఏ మంత్రి గానీ ఎంఎల్ఏ గానీ బయటకు వచ్చే అవకాశం లేదు. రాబోయే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కదని అనుమానం ఉన్నవారు, ఖాయంగా అనుకుంటున్నవాళ్ళు మాత్రమే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు. అయితే పార్టీకి రాజీనామాలు చేసి బయటకు వచ్చేసిన ఇద్దరు మంత్రులు, నలుగురు ఎంఎల్ఏలకు ఆ అవసరం లేదట. ఎందుకంటే వాళ్ళంతా తమ నియోజకవర్గాల్లో పట్టున్నవారే.
తమకు టికెట్లు ఖాయం, మళ్ళీ అధికారంలోకి రావటం ఖాయమని తెలిసి కూడా ఎందుకని బీజేపీని వదిలేస్తున్నారో ఎవరికీ అర్ధంకావటంలేదు. దాంతో సర్వే ఫలితాలకు క్షేత్రస్ధాయి పరిస్ధితులకు సబంధం లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మెజారిటి మీడియా బీజేపీ గుప్పిట్లోనే ఉంది. ఉత్తరాధిలోని చాలా మీడియా సంస్ధలు బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు, కథనాలు ఇవ్వాలంటేనే భయపడుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీకి అనుకూలంగా జనాల నాడిని మలిచేందుకు వీలుగా పార్టీ నేతలు సర్వే ఫలితాలను ప్రభావితం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
బీజేపీనే మళ్ళీ గెలుస్తుందని అంత కచ్చితంగా సర్వేల్లో చెబుతున్నదే నిజమైతే టికెట్లు ఖాయమైన వారు బయటకు రారన్నది నిజం. అయినా వచ్చేస్తున్నారంటే సర్వేలకు, వాస్తవ పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉండాలి. ఇప్పుడు బయటకు వచ్చిన వారు కాకుండా మరో 12 మంది ఎంఎల్ఏలు కూడా బీజేపీకి రాజీనామా చేయబోతున్నట్లు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పెద్ద బాంబు పేల్చారు. మరిదే నిజమైతే ఇంకెంతమంది బయటకు వచ్చేస్తారో చూడాల్సిందే.