Begin typing your search above and press return to search.
ఆ ఎమ్మెల్యేను ఓడిస్తామంటున్న టీఆర్ ఎస్ శ్రేణులు
By: Tupaki Desk | 11 Sep 2018 10:10 AM GMTతెలంగాణ వచ్చాక బాగా ఇబ్బందిపడ్డ పార్టీ తెలుగుదేశమే.. 2014 ఎన్నికల్లో దాదాపు 15 సీట్లు గెలుచుకొని తెలంగాణలో తన ఉనికి చాటుకుంది. కానీ తర్వాత బాబు రెండు కళ్ల సిద్ధాంతం.. ఓటుకు నోటులో దొరికి అమరావతికి తరలిపోవడంతో టీడీపీ కుదేలైంది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా అభివృద్ధి కోసం టీఆర్ ఎస్ లో చేరిపోయారు. అలా వచ్చిన వారే హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.ఆంధ్రా జనాభా ఎక్కువగా ఉండే కూకట్ పల్లిలో ఆంధ్రా మూలాలున్న కృష్ణారావే ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ అదే సమయంలో ఆంధ్రా - తెలంగాణ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక్కసారి కూడా ఉద్యమంలో పాల్గొన్నది లేదు. కానీ ఇప్పుడు టీఆర్ ఎస్ లో కీలక నేత అయ్యారు. 105 మంది ప్రకటించిన జాబితాలో ఈయన కూడా కూకట్ పల్లి టికెట్ దక్కించుకోవడం విశేషం.
సీఎం కేసీఆర్ కూకట్ పల్లి సీటును మాధవరంకు ఇవ్వడంతో ఆయన ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. మరోసారి గెలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఈయన అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గంలో ఆది నుంచి పనిచేసుకుంటూ వస్తున్న టీఆర్ ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. 13 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్నామని.. తమకు ఇవ్వకుండా ఏనాడు తెలంగాణ కోసం జెండా మోయని మాధవరంకు టికెట్ ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వారందరూ మాధవరం కోసం పనిచేయమని తీర్మానించారు. కుకట్ పల్లి నియోజకవర్గంలో టీఆర్ ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఆది నుంచి పనిచేస్తున్న పి. నర్సింగరావుకే తమ మద్దతు అని టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రకటిస్తున్నారు. సోమవారం రాత్రి ఈ మేరకు మూసాపేట్ లోని దేవి గ్రాండ్ హోటల్ లో 500మంది టీఆర్ ఎస్ నాయకులు - నర్సింగరావు మద్దతుదారులు సమావేశమై నర్సింగరావుకే తమ మద్దతు అని ప్రకటించారు. మాధవరంను ఓడిస్తామని తీర్మానించారు.
కూకట్ పల్లి టీఆర్ ఎస్ నేతల తిరుగుబాటుతో మాధవరం కృష్ణారావు చిక్కుల్లో పడ్డారు. ఈయన టీఆర్ ఎస్ తాజా మాజీ మంత్రి గొట్టిముక్కల పద్మారావుకు దగ్గర బంధువు. దీంతో ఆయన లాబీయింగ్ తోనే టికెట్ దక్కించుకున్నారు. ఇప్పుడు నియోజకవర్గ నేతలంతా ఎదురు తిరగడంతో టికెట్ చేజారుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మాధవరం ను వ్యతిరేకిస్తున్న నర్సింగరావు మాత్రం ఈసారి ఖచ్చితంగా గెలుస్తానని ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కూకట్ పల్లి రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి.