Begin typing your search above and press return to search.

డ‌బ్బులిస్తాన‌నే నా మాట మోడీ చెప్ప‌రేం?

By:  Tupaki Desk   |   14 Feb 2019 8:32 AM GMT
డ‌బ్బులిస్తాన‌నే నా మాట మోడీ చెప్ప‌రేం?
X
ప్ర‌ధాని మోడీపై ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌.. కింగ్ ఫిష‌ర్ విజ‌య్ మాల్యా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దాదాపు రూ.9వేల కోట్ల‌తో దేశం నుంచి పారిపోయి బ్రిట‌న్ లో కులాశాగా ఉన్న ఆయ‌న్ను తిరిగి దేశానికి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు భార‌త స‌ర్కారు చెబుతున్నా.. ఇప్ప‌టివ‌ర‌కూ అడుగు ముందుకు ప‌డ‌న‌ట్లుగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

పార్ల‌మెంటు స‌మావేశాల చివ‌రి రోజున ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. మాల్యా ఎపిసోడ్‌ ను ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. రూ.9వేల కోట్ల‌తో ఒక వ్య‌క్తి పారిపోయార‌ని మోడీ చెప్పిన మాట‌ను ఉటంకించిన మాల్యా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన‌మంత్రి చ‌క్క‌గా మాట్లాడ‌తార‌ని త‌న‌కు తెలుస‌ని.. కానీ ఆయ‌న తాను చెప్పిన మాట‌ల్ని ప్ర‌ధాని చెప్ప‌ట్లేద‌న్నారు. బ్యాంకుల‌కు తాను ఇస్తాన‌ని చెప్పిన డ‌బ్బుల్ని తీసుకోవాల‌ని కోర్టుల‌కు మోడీ స‌ర్కార్ చెప్ప‌ట్లేద‌న్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న క్వ‌శ్చ‌న్ చేశారు.

మోడీ ప్ర‌సంగం తాను విన్నాన‌ని.. ఆయ‌న అన‌ర్గ‌ళంగా మాట్లాడార‌ని త‌న‌కు తెలుస‌ని.. కానీ ఆయ‌న తాను చెప్పిన విష‌యాల్ని ప్ర‌స్తావించ‌లేద‌న్నారు. కింగ్ ఫిష‌ర్ కు ఇచ్చి ప్ర‌జాధ‌నాన్నితిరిగి ఇచ్చేవీలున్నా.. ప్ర‌భుత్వం ఆ ప‌ని ఎందుకు చేయ‌ట్లేద‌ని ప్ర‌శ్నించారు.

క‌ర్ణాట‌క హైకోర్టు ముందు తాను సెటిల్ మెంట్ ఆఫ‌ర్ తో వ‌చ్చాన‌ని.. ఆది ప‌నికిరాని ఆఫ‌ర్ అని కొట్టిపారేయొద్ద‌ని.. తాను నిజాయితీగానే ముందుకొచ్చాన‌న్నారు. కానీ.. కింగ్ ఫిష‌ర్ కు ఇచ్చిన రుణాల్ని బ్యాంకులు ఎందుకు తీసుకోవ‌టం లేద‌న్నారు. తాను సంప‌ద‌ను దాచిన‌ట్లు ఈడీ చెబుతోంద‌ని.. అదే నిజ‌మైతే రూ.14వేల కోట్ల విలువైన ఆస్తుల‌ను కోర్టు ముందు ఎందుకు ఉంచుతాన‌ని మ‌రో ట్వీట్ లో ప్ర‌శ్నించారు.