Begin typing your search above and press return to search.
రంగంలో బాబు కోవర్ట్ ... దానికి 14 ఎకరాలు ఎందుకు ?
By: Tupaki Desk | 23 Nov 2019 7:39 AM GMTమాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిత్యం ఎదో ఒక విషయంపై ఫైర్ అవుతూనే ఉంటారు. నిజానికి చంద్రబాబు ని విజయసాయి రెడ్డి లాగా విమర్శించే మరో నాయకుడు వైసీపీ లో లేడు అనే చెప్పాలి. సీఎం గా ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ని సందర్భం వచ్చిన ప్రతిసారి విమర్శిస్తూనే ఉంటాడు. తాజాగా మరోసారి టీడీపీ నేతల పై , అధినేత చంద్రబాబు పై ట్విట్టర్ లో విరుచుకు పడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి.
తాజాగా ఏపీలో పెట్టుబడులు పెట్టలేము అని లాలూ గ్రూప్ వెనక్కి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించాడు. దీనిపై స్పదించిన ఎంపీ విజయసాయి రెడ్డి ... లులూ గ్రూప్ విశాఖ నుంచి వెళ్లిపోవడానికి.. ఏపీలో పెట్టుబడులు పెట్టమని చెప్పడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని , లులూ సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోతే తెగ గుండెలు బాదుకుంటున్నారని, అది రాష్ట్రం పై ఉన్న ప్రేమ కాదని, బాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఎక్కడ పోతుందనే భయం పట్టుకుందని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో లులూ గ్రూప్ కు వైజాగ్ నడిబొడ్డున 14 ఎకరాల భూమిని చంద్రబాబు ఉదారంగా కట్టబెట్టారని ఆరోపించారు. దీనికి ఎంత కమిషన్ ముట్టిందో త్వరలోనే బయట పడుతుందన్నారు. వాళ్ల పెట్టుబడికి అంత భూమి అవసరం లేదని ప్రభుత్వం రద్దు చేసిందని.. దీనిపై లులూ సంస్థ కంటే చంద్రబాబే ఎక్కువ గుండెలు బాదుకుంటున్నారని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. అలాగే తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బిజెపిలోకి పంపించిన కోవర్టు ను చంద్రబాబు రంగంలోకి దింపారని, అందుకే ‘కోవర్టు’ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బిజెపీతో టచ్ లో ఉన్నారని చెప్పించారని, అబద్ధానికీ ఒక హద్దుండాలని చెప్పారు.