Begin typing your search above and press return to search.
బాలయ్య ధైర్యానికి కారణమేంటి?
By: Tupaki Desk | 2 May 2019 9:36 AM GMTబాలయ్య కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ ఎన్నికల్లో హిందూపురం నుంచి తను గెలవడమే కాదు.. తెలుగుదేశం పార్టీనే మళ్లీ అధికారంలోకి రాబోతోందని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలుపు కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురంలో నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, పోలింగ్ బూత్ కన్వీనర్లతో సమీక్ష సందర్భంగా బాలయ్య ఈ ధైర్యాన్ని వ్యక్తం చేశారు.
టీడీపీ గెలుపునకు గల కారణాలను కూడా ఈ సందర్భంగా బలయ్య వివరించడం విశేషం. ఎన్నికల పోలింగ్ సరళి చూశాక టీడీపీకీ అనుకూలంగా ఉందని అర్థమైందని.. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు.. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపాయని బాలయ్య అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పెన్షన్ల పెంపు, ఆడపడుచులకు పసుపు-కుంకుమ పథకం.. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతులకు అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ పథకాలే మళ్లీ టీడీపీకి పట్టం కడుతాయని వివరించారు. సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ గెలుపు ఏకపక్షంగా ఉండేలా ఇప్పటి నుంచే కృషి చేయాలని పార్టీ క్యాడర్ కు బాలయ్య పిలుపునిచ్చారు.
కాగా హిందూపురంలో బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతాకాదు.. సొంత పార్టీ నేతలను కొట్టడం.. ప్రశ్నించిన వారిని తిట్టడం.. ఆయన బీభత్సం చేసిన వీడియోలు మీడియాలో పెద్ద దుమారం రేపడం తెలిసింది. ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించడంలో బాలయ్య విఫలమయ్యాడని హిందూపురం ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇక స్థానికంగా ఉండని ఎమ్మెల్యేగా కూడా బాలయ్యపై జనాగ్రహం ఉంది. ఈ ఎన్నికల్లో ఓడిపోయే టీడీపీ నేతల్లో బాలయ్య ముందు వరుసలో ఉంటాడని చాలా సర్వేల్లో తేటతెల్లమైంది. అలాంటి బాలయ్య విజయం పై ధీమా వ్యక్తం చేయడం.. భరోసాగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగడంతో టీడీపీ శ్రేణుల్లోనూ ఆశ్చర్యం కలుగుతోందట..