Begin typing your search above and press return to search.

లవ్ లెస్ గా ఉండటం వల్లే గేట్స్ విడాకులు

By:  Tupaki Desk   |   14 May 2021 9:30 AM
లవ్ లెస్ గా ఉండటం వల్లే గేట్స్ విడాకులు
X
ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన బిల్ గేట్స్-మిలిందా దంపతుల విడాకుల వ్యవహారానికి సంబంధించి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పర్ ఫెక్టు కపుల్ గా అభివర్ణించే వీరిద్దరు మనస్పర్థలు రావటం.. విడిపోవటాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఇంతకీ వారి విడాకులకు కారణం ఏమిటన్న విషయంపై ఇప్పటికే పలు వాదనలు.. కథనాలు రావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా న్యూయార్కు పోస్టు ఆసక్తికర కథనాన్ని పబ్లిష్ చేసింది.అందులో గేట్స్ తన విడాకుల వ్యవహారాన్ని ఎవరితో పంచుకున్నారో పేర్కొంది.

సాధారణంగా ఏదైనా ఇంట్లో జరుగుతున్న రచ్చను సన్నిహితులైన స్నేహితులకు తొలుత చెప్పటం మామూలే. ఇందుకు బిల్ గేట్స్ సైతం మినహాయింపేమీ కాదు. మెలిందాతో విడాకుల విషయంలోనూ ఆయన.. తన గోల్ప్ మిత్రులతో పంచుకునే వారట. తన వైవాహిక జీవితం ప్రేమ రహితంగా మిగిలిపోయినట్లుగా వారితో చెప్పుకున్నట్లుగా తెలిపింది. వేర్వేరు సందర్భాల్లో తన స్నేహితుల వద్ద ఆయనీ విషయాన్ని చెప్పుకున్నారన్ని చెప్పింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏ హవాయ్ గోల్ప్ కోర్టు దగ్గర మిలిందాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారో.. అదే చోట 27 ఏళ్ల తర్వాత విడిపోవాలన్న ఆలోచనను తన మిత్రుల వద్ద చర్చించటం గమనార్హం. రానున్న రోజుల్లో మరెన్ని కథనాలు గేట్స్ విడాకుల మీద వస్తాయో చూడాలి.