Begin typing your search above and press return to search.
క్రెడిట్ కోసం బీజేపీ పాకులాట.. ఏం జరిగిందంటే...!
By: Tupaki Desk | 26 Jan 2022 11:30 PM GMTఏపీ బీజేపీ నేతలు క్రెడిట్ కోసం పాకులాడుతున్నారా? తాజాగా జరిగిన రాష్ట్ర పరిణామాలను వారి ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? దీని కోసం.. నేతలు పోటా పోటీగా వ్యాఖ్యలు చేస్తున్నారా? అంటే. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం.. జిల్లాలను విభజిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి గెజిట్ జారీ కూడా చేసింది. మొత్తం మరో 13 కొత్త జిల్లాలతో మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. నిజానికి ఇది ఎన్నికలకు ముందు చూచాయగా .. వైసీపీ నేతలు చెప్పినవే.
అయితే.. ఇది ప్రజల్లో ప్లస్ అవుతుందని, వైసీపీకి, సీఎం జగన్‌కు కూడా పెద్ద ఎత్తున క్రెడిట్ వెళ్లిపోతుందని భావించిన.. బీజేపీ నేతలు..వెంటనే లైన్‌లోకి వచ్చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటును తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు.. అసలు.. ఈ ప్రతిపాదన తమదేనని చెప్పుకొచ్చారు. ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల మేనిఫెస్టోలో దీనిని బీజేపీ చేర్చించదని.. తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని.. జిల్లాగా మారుస్తామని ప్రకటించామని అన్నారు.
అయితే.. ఇదే నిజమైతే.. బీజేపీ నేతలు ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు.. ఎందుకో.. కన్నానే చెప్పాలి. పోనీ.. ఇదే నిజమైతే.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాన్నయినా.. ప్రశ్నించాలి కదా! కానీ. ఇదంతా కేవలం సెల్ఫ్ గోల్ కోసంచేస్తున్న రాజకీయమేనని అంటున్నారు పరిశీలకులు. ఇక, గుడివాడ విషయంలోనూ.. బీజేపీ పెద్దలు.. క్రెడిట్ కకోసం పాకులాడుతున్నపరిస్థితి కనిపించింది. ఇక్కడ ఏం జరిగిందో జరగలేదో.. అనే విషయంపై అధికార, ప్రధాన ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో ఫైర్ నడుస్తున్న సమయంలో జోక్యం చేసుకుంది.
తగుదునమ్మా..అంటూ.. సంక్రాంతి సంబరాల పేరిట(అది కూడా సంక్రాంతి అయిపోయి.. పది రోజుల తర్వాత) గుడివాడలో పర్యటనలకు బయలు దేరింది. ఈ క్రమంలో సోము వీర్రాజు.. సీఎం రమేష్ వంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో గుడివాడలో ఏదైనా జరిగిపోయి ఉంటే. అ క్రెడిట్ తాము ఎక్కడ మిస్సవుతామోనన్న ఆరాటం తప్పితే.. ఇంకేమీ లేదని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి బీజేపీ క్రెడిట్ పాలిటిక్స్ ఇంకా ఎంత దూరం నడుస్తాయో చూడాలి.