Begin typing your search above and press return to search.
కరోనా రోగులకు రక్తం గడ్డకట్టడానికి కారణం తెలిసింది!
By: Tupaki Desk | 25 Jun 2021 2:30 AM GMTకరోనా వైరస్ సోకి నయం అయిన తర్వాత కూడా సైడ్ ఎఫెక్టులు వీడడం లేవు. గుండెపోటులు, బ్లాక్ ఫంగస్ లు వెంటాడుతున్నాయి. ప్రాణాలు తీస్తున్నాయి. కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడం లేదా చిక్కపడడం జరిగి గుండెపోటులకు దారితీస్తోంది.
కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టడంపై తాజాగా శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఒక ప్రత్యేక రకమైన అణువు దీనికి కారణం అని తేల్చారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఈ అణువు స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల రక్తం గడ్డకట్టే పరిస్థితి వస్తుందని తేలింది. దీనివలన రోగి మరణించే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు.
ఐర్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ పరిశోధకులు తాజాగా రక్తం గడ్డకట్టడంపై పరిశోధించారు. కరోనా రోగులలో రక్తం గడ్డం కట్టడం ఎందుకు అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులపై పరిశోధించారు. వారి రక్త నమూనాలు సేకించి శోధించారు.
ఈ రోగులలో వి.డబ్ల్యూఎఫ్ అణువు అధిక స్థాయిలో ఉందని రక్త నివేదికలు వెల్లడించాయి. ఈ అణువు రక్తం గడ్డ కట్టడాన్ని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా వీరిలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే అణువుల స్థాయి తక్కువగా ఉందని తేలింది. ఈ రెండు అణువుల సమతుల్యత క్షీణించినప్పుడు గడ్డకట్టడం మొదలవుతుందని తేలింది. ఇలా గడ్డకట్టడం మరణానికి కారణమవుతోందని తేలింది. రక్తం గడ్డకట్టడం వల్ల చాలా మంది కరోనా రోగులు మరణించారని పరిశోధనలో తేలింది. వీవీఎఫ్ స్థాయిని నిర్వహించడానికి ఇంకా పరిశోధనలు చేయాలని నిర్ణయించారు.