Begin typing your search above and press return to search.

విశాఖ ను బాబు వద్దనడానికి కారణమదేనా?

By:  Tupaki Desk   |   27 Dec 2019 10:14 AM GMT
విశాఖ ను బాబు వద్దనడానికి కారణమదేనా?
X
నిలబడి నీళ్లు తాగడం కన్నా.. పరిగెత్తి పాలు తాగడమే బెటర్ అని చంద్రబాబు భావిస్తుంటారని పొలిటికల్ వర్గాల్లో ఓ సెటైర్ ఉంది. ఉమ్మడి ఏపీ విడిపోయాక కట్టుబట్టలతో మిగిలిన ఏపీ రాష్ట్రానికి అప్పటికే ఉమ్మడి రాష్ట్రం లో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన విశాఖను రాజధాని చేస్తే ఇప్పుడీ పంచాయతీ అంతా ఉండేది కాదు.. కానీ విశాఖ ను రాజధాని చేస్తే చంద్రబాబు ఎలా అవుతారు.. కాదు కదా అందుకే అమరావతి ని తెరపైకి తెచ్చారు.

నిజానికి విశాఖపట్నానికి రాజధాని కి కావాల్సిన అన్ని హంగులున్నాయి. ఎయిర్ పోర్టు, అంతర్జాతీయ పరిశ్రమలు, స్టేడియాలు, మౌళిక వసతులున్నాయి. చంద్రబాబు రాజధానిగా ప్రకటించి పాలిస్తే అయిపోయే ముచ్చట.. కానీ చంద్రబాబు, ఆయన అనుయాయులు రాజధాని పేరిట రాజకీయం చేశారు. కొత్త రాజధానితో కోట్లు కొల్లగొట్టవచ్చని ప్లాన్ చేశారనే విమర్శలున్నాయి. రియల్ భూము తీసుకొచ్చి ముందే భూములు కొని లాభ పడవచ్చని పచ్చ బ్యాచ్ ప్లాన్ అని వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నారు.

అందుకే లక్ష 10వేల కోట్ల తో బాబు గారు అమరావతి ని మొదలుపెట్టి 5వేల కోట్లు అప్పులు తెచ్చి ఐదేళ్లలో పూర్తి చేయకుండా మొండి గోడలు వదిలిపెట్టారు. జగన్ ఇప్పుడు రాజధానిని విశాఖకు మార్చేస్తున్నారు.

నిజానికి ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట.. నాడు ఎన్టీఆర్ తెలుగు దేశం స్థాపించినప్పటి నుంచి పోయిన సారి వరకూ తెలుగుదేశం పార్టీ మొత్తం క్లీన్ స్వీప్ చేసేది. కానీ ఇప్పుడు అమరావతి యే ముద్దు.. విశాఖ వద్దు అన్న నినాదం తో టీడీపీ, చంద్రబాబు ఉత్తరాంధ్ర పై ఆశలు వదలు కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సొంత లాభం కోసం విశాఖ ను వద్దంటున్న బాబు గారు అక్కడ తెలంగాణ లో లాగానే పార్టీని భూ స్థాపితం చేసుకోవడానికి కంకణం కట్టుకొని అమరావతి వెంట పరుగులు తీస్తుండడం విశేషం..