Begin typing your search above and press return to search.
బాబుతో `దొంగ`బాబా కున్న లింకేంటబ్బా?
By: Tupaki Desk | 27 May 2018 8:25 AM GMTనిత్యానంద....డేరాబాబా....ఆశారాం బాపూ....ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాన్తాడంత ఉంటుంది. దేశంలోని కొందరు దొంగబాబాలు...అమాయక ప్రజలను మోసం చేసి...భక్తి పేరుతో వేల కోట్ల రూపాయల కూడబెట్టి అక్రమ సామ్రాజ్యాలను నిర్మించిన దొంగబాబాలు కటకటాల వెనుకకు వెళ్లడం గురించి వింటూనే ఉన్నాం. ఇటువంటి దొంగబాబాలను నమ్మి మోసపోవద్దని ఎంత ప్రచారం జరుగుతోన్న కొందరి తీరు మారడం లేదు. నిరక్షరాస్యులో....లోకజ్ఞానం లేని వారో....ఇటువంటి దొంగబాబాల ఉచ్చులో చిక్కుకున్నారంటే అయ్యోపాపం అని జాలి చూపించవచ్చు. అయితే, 40 ఏళ్ల అపార రాజకీయ అనుభవం ఉండి...ముచ్చటగా మూడోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ..రాబోయే కాలంలో కాబోయే ప్రధాని అంటూ ఆయన అనుచరగణం కలలు కంటోన్న ఏపీ సీఎం చంద్రబాబు...ఓ `దొంగ`బాబాకు సలాం కొడుతోన్న వైనం ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కింగ్ లా కనిపిస్తున్నారు.....మరి వంగి వంగి దండాలెందుకు పెడుతున్నారు......అంటూ టాలీవుడ్ లో ఓ పాపులర్ సాంగ్ ఉంది. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి కూడా ...అదే తరహాలో ఓ `దొంగ` స్వామీజీకి వంగి వంగి దండాలు పెడుతోన్న ఫొటో పెను దుమారం రేపుతోంది. గత మంగళవారం విశాఖలో టీడీపీ చేపట్టిన ధర్మపోరాట సభలో పాల్గొన్న చంద్రబాబు....అదే రోజు సాయంత్రం...ఓ బాబాకు నమస్కరించడం చర్చనీయాంశమైంది. విశాఖ ఎయిర్ పోర్టులో శంకర సదానంద స్వామి అనే ఓ స్వామీజీ ఆశీస్సులను చంద్రబాబు తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు కేసుల్లో నిందితుడు కావడమే అందుకు కారణం. ఎయిర్ పోర్టులోని వీఐపీ లాంజ్ లో సీఎంకు శంకరస్వామి శాలువా కప్పి, పండ్లు అందించి వేదమంత్రాలతో స్వాగతం పలికారు. ఈ సీన్ లో మంత్రి గంటా శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే గణబాబు కూడా ఉండటం విశేషం.
విశాఖలోని కప్పరాడ ప్రాంతానికి చెందిన శంకర సదానంద స్వామి, అలియాస్ శంకర స్వామి, అలియాస్ శ్రీ శంకర్ విద్యానంద సరస్వతి స్వామి.....పలు కేసుల్లో నిందితుడు కావడమే అందుకు కారణం.ఆ సోకాల్డ్ స్వామి మొదటి నుంచి వివాదాస్పదుడే. గతంలో ఆ స్వామి పలు కేసుల్లో నిందితుడని, పోలీసు స్టేషన్ లో చేతిలో పలక పట్టుకొని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ఈ ఘటన వైరల్ అయింది. 2014 మేలో ఆ స్వామిపై తొలిసారిగా కేసు నమోదైంది. ఆ దొంగ స్వామి ఏకంగా... పోలీస్ జీపు నుంచి వైర్ లెస్ సెట్, వాకీటాకీలను కొట్టేసి పోలీసులకు చిక్కారు. అప్పట్లో సదరు స్వామిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ కొనసాగుతోంది. దాంతోపాటు, తన స్వామీజీ ముసుగును అడ్డుపెట్టకొని అయన పలువురిని మోసం చేశారన్న ఆరోపణలున్నాయి. అయితే, ఇటువంటి ట్రాక్ రికార్డు ఉన్న ఓ స్వామీజీకి....చంద్రబాబుకు సంబంధాలుండడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై తమకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రొటోకాల్ బాధ్యత రెవెన్యూ అధికారులదని, వీఐపీ లాంజ్ లో సీఎంను ఎవరు కలిశారో తమకు తెలియదని ఏసీపీ లంకా అర్జున్ చెప్పారు. మరోవైపు, రెవెన్యూ అధికారులు ...దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఆ స్వామి అక్కడికి ఎలా వచ్చారో తమకు తెలియదని అర్భన్ తహసీల్దార్ నాగభూషణరావు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా....అటువంటి నేర చరిత్ర ఉన్న స్వామీజీని కలవడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, సదరు స్వామీజీ సీఎంతో దిగిన ఫొటోలను అడ్డుపెట్టుకొని ఓ పాపులర్ రెడీమేడ్ షాప్ కు వెళ్లి దుస్తులు ఫ్రీగా పట్టుకెళ్లినట్టు తెలుస్తోంది. దాంతోపాటు, విశాఖలో పీఠం పెట్టేందుకు ప్రభుత్వపరంగా ఓ స్థలం ఇప్పించాలని జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతను కలిసి కోరినట్టు పుకార్లు రావడం ఈ మొత్తం వ్యవహారానికి కొసమెరుపు.