Begin typing your search above and press return to search.
బాబు నోరును మూతవేయించిన మోదీ...అందుకే అజ్ఞాతమా?
By: Tupaki Desk | 24 Nov 2019 5:20 AM GMTఓ సంచలన పరిణామం. విస్మయకర ఎత్తుగడ. శుక్రవారం అర్ధరాత్రి దేశమంతా నిద్రిస్తుండగా బీజేపీ ‘పొలిటికల్ స్ట్రైక్' నిర్వహించింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ప్రకటించడంతో...శివసేన-బీజేపీ- కాంగ్రెస్ ఆధ్వర్యంలో...శనివారం మహారాష్ట్రలో ‘వికాస కూటమి’ ఉదయిస్తుందని మూడు పార్టీల నేతలు భావించారు. పదవుల పంపకంపై కలలుగంటూ హాయిగా నిద్రపోయారు. కానీ.. పిడుగులాంటి వార్తతో ఉలిక్కిపడి లేచారు. కనీసం పీడకలలో కూడా రాని సన్నివేశం వారి కళ్ల ముందు ఆవిష్కృతమైంది. అజిత్‌పవార్ నేతృత్వంలో ఎన్సీపీ చీలిపోయింది. బీజేపీతో కలిసి ఆయన ప్రభుత్వంలో భాగమయ్యారు. మహారాష్ట్రలో అనూహ్య పరిణామాలన్నీ దాదాపు 10 గంటల వ్యవధిలోనే జరిగాయి. ఈ మహామాయపై దేశవ్యాప్తంగా నేతలు విరుచుకుపడ్డారు. అయితే, దేశంలోనే సీనియర్‌నని...తానే ప్రజాస్వామ్య ఉద్ధారకుడిని అని...ఇంకా చెప్పాలంటే...ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఢీకొట్టకలిగే నాయకుడిని అని ప్రకటించుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం కిక్కురుమనడం లేదు. ముఖ్యనేతలంతా స్పందించినా...ఈ నేత మాత్రం..ఇటు ఆన్‌లైన్లో అటు ఆఫ్‌లైన్లో స్పందించడం లేదు.
గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని, దేశ చరిత్రలో ఇదో చీకటిరోజని కాంగ్రెస్, శివసేన విమర్శించాయి. ఇది మహారాష్ట్రపై ‘సర్జికల్ స్ట్రైక్'గా ఉద్ధవ్ ఠాక్రే అభివర్ణించగా, బీజేపీ ‘కాంట్రాక్ట్ కిల్లర్'గా వ్యవహరించిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుతో అమిత్ షాను చాణక్యుడిగా కీర్తిస్తూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవాన్ తనయ సుప్రియా సూలే ఈ పరిణామంపై స్పందిస్తూ...`పార్టీతో పాటు కుటుంబంలో చీలిక ఏర్పడింది. నా జీవితంలో ఎన్నడూ ఇంతగా మోసపోలేదు. అజిత్‌కు అండగా నిలబడ్డాను కానీ ఏం లభించిందో చూడండి’ అంటూ వాపోయారు. రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేద్కర్ మనువడు, వంచిత్ బహుజన్ ఆఘాడి పార్టీ అధినేత ప్రకాశ్ అంబేద్కర్ మహారాష్ట్ర పరిణామాలపై స్పందిస్తూ ‘ఇటీవల మోదీ, అమిత్ షాను శరద్ పవార్ కలిశారు. రైతుల సమస్యల గురించి ఈ సమావేశం జరిగినట్టు చెప్పారు. రెండు రోజుల తర్వాత, మహారాష్ర్ట గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రైతులకు పరిహారం ప్రకటించారు. మోదీ-పవార్ భేటీలో ఏదో జరిగింది. అదేంటో తెలియదు.` అని వెల్లడించారు.
ఇంత జరిగినా...తెలుగురాష్ట్రాల్లో ముఖ్యమైన పార్టీగా....ఇంకా చెప్పాలంటే.. `స్వయం ప్రకటిత జాతీయ పార్టీ` అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం స్పందించలేదు. ఏ పరిణామంపై అయినా... వెంటనే విలేకరుల సమావేశం పెట్టి ..దాన్ని తన ఖాతాలో వేసుకోవడం లేదా వ్యతిరేకించడమో చేసి...మీడియాలో హడావుడి చేయడం, లేదంటే ట్విట్టర్లో స్పందించే చంద్రబాబు...ఇప్పుడు మాత్రం కిక్కురుమనడం లేదు. దీని వెనుక చంద్రబాబుపై బీజేపీ పెద్దలు పెట్టిన స్పెషల్ ఫోకస్, ఆయన, ఆయన సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణలే కారణమా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.