Begin typing your search above and press return to search.

రాహుల్‌ ని వదలని బాబు బొమ్మళి

By:  Tupaki Desk   |   10 Jan 2019 5:44 AM GMT
రాహుల్‌ ని వదలని బాబు బొమ్మళి
X
తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి చావు తప్పి కన్ను లొట్టపోయింది. ఎన్నికలకు ముందు భారీ అంచనాలతో ఈ రెండు పార్టీలు కలసిన చంద్రబాబు దెబ్బతో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడి ప్రభ ముగిసినట్లేనని తెలంగాణ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఎన్నికలపై జరిగిన సమీక్షలో కూడా చంద్రబాబు నాయుడి కారణంగానే ఓటమి పాలయ్యామని తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు అంచన వేశారు. దీంతో రానున్న లోక్‌ సభ ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో చంద్రబాబుతో పొత్తు వద్దని కాంగ్రెస్ నాయకులు తెగేసి చెబుతున్నారు. రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీతో సమవేశమైన ఏఐసీసీ కార్యదర్శులలో ఒకరైన గిడుగు రుద్రరాజు సైతం తమ అధినేతకు పొత్తు వద్దని సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే రాహుల్ గాంధీ మాత్రం పొత్తు అంశంపై పునరాలోచించాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో దెబ్బ తిన్న తాము ఆంధ్రప్రదేశ్‌ లో కూడా దెబ్బ తింటే కష్టమని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో తమకు బలం లేకపోయినా మళ్లీ నష్టం మాత్రం జరగకూడదని రాహుల్ గాంధీ సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం రాహుల్ గాంధీని వదలటం లేదు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్‌ తో కలిపి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు పొత్తు వద్దని మొత్తుకున్న చంద్రబాబు నాయుడు మాత్రం పదే పదే రాహుల్‌ తో మాట్లాడడం, ఢిల్లీ వెళ్లి కలవడం చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనను కలవడానికి వస్తే అంగీకరించకపోవడం సభ్యత కాదని రాహుల్ గాంధీ కాంగ్రెస్ శ్రేణుల వద్ద అన్నట్లు సమాచారం. చంద్రబాబుతో కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ కు ఎటువంటి లాభం కలగదని, కాంగ్రెస్ నాయకులు కుండబద్దల కొట్టి మరీ చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తమతో కలుస్తున్నారని ఏపీ కాంగ్రెస్ నాయకులు వాదన. అందుకే వదలా బొమ్మాళి అన్నట్లుగా రాహుల్ గాంధీని చంద్రబాబు వదలటం లేదని కాంగ్రెస్ నాయకుల విశ్లేషణ. ఈసారి ఒంట‌రిగా పోటీ చేస్తే అధికారం, ఎక్కువ సీట్లు గాని రావు కానీ వ‌చ్చే ఏడాదికి ఈ పోటీ కాంగ్రెస్‌ కు బ‌లాన్నిస్తుంది అన్న‌ది కాంగ్రెస్ నేత‌ల మ‌సులో మాట‌.