Begin typing your search above and press return to search.
బీఆర్ఎస్ గురించి కాంగ్రెస్ బీజేపీలకు ఉలుకెందుకు?
By: Tupaki Desk | 6 Oct 2022 5:37 AM GMTనిన్నటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర పార్టీ గా రూపాంతరం చెందింది. ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చుకుని జాతీయ రాజకీయాల్లో బాగా యాక్టివ్ అయిపోవాలని కేసీయార్ అనుకున్నారు. ఈ విషయాన్ని జాతీయ పార్టీ సందర్భంలోనే ప్రకటించారు. తన పార్టీ ప్రాంతీయ పార్టీగానే ఉండిపోవాలా ? లేకపోతే జాతీయ పార్టీగా మారాలా అన్నది కేసీయార్ ప్రైవేటు వ్యవహారం. పార్టీ ఎలాగున్నా జనాల ఆదరణ లేకపోతే ఉపయోగం ఉండదు.
సరే కేసీఆర్ పార్టీ కేసీఆర్ ఇష్టమని అనుకుంటే మరి ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఎందుకింతగా విరుచుకుపడుతున్నాయో అర్ధం కావటం లేదు. పార్టీని కేసీయార్ ప్రకటించటం ఆలస్యం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నేతలు ఒకటే ఎద్దేవా చేస్తున్నారు. బీఆర్ఎస్ ను పట్టుకుని బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అంటూ రెండు పార్టీల నేతలు ఒకటే ఎగతాళి చేస్తున్నారు.
నిజానికి రెండుపార్టీల నేతలు కేసీయార్ ను ఎగతాళి చేయాల్సిన అవసరమే లేదు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్, బీజేపీలకు ఏమిటి సమస్యో అర్థం కావటం లేదు.
ఒకపుడు అంటే 1989 కి ముందు బీజేపీ పరిస్థితి ఏమిటి పార్లమెంటులో కేవలం 2 అంటే 2 సీట్లు మాత్రమే ఉండేది. 1990లో అప్పటి అగ్రనేత ఎల్కే అద్వానీ ఆధ్వర్యంలో రథయాత్ర జరిగిన తర్వాత కదా ఉత్తరాధిలో పార్టీ పుంజుకుని మెల్లిగా సీట్లు గెలుచుకోవటం మొదలుపెట్టింది. అలాంటి పార్టీ ఇపుడు 305 సీట్లతో పార్లమెంటులో సింగిల్ లార్జెస్టు పార్టీగా నిలబడి ఎనిమిదన్నరేళ్ళుగా అధికారంలో ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావటానికి సంవత్సరాలుపట్టింది.
అలాగే ఒకపుడు కేంద్రంతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అధికారం చెలాయించిన కాంగ్రెస్ ఇప్పటి పరిస్ధితి ఏమిటి ? ముక్కీ మూలిగి రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉందంతే. కేంద్రంలో ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చేంత సీన్ కాంగ్రెస్ కుందా ? రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.
పార్లమెంటులో సీట్ల పెరుగుదలను చూస్తే బీజేపీకన్నా కేసీయార్ పార్టీయే చాలా మెరుగు. కాబట్టి బీఆర్ఎస్ గురించి ఇంత చులకనగా మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఏ పార్టీకైనా నేతకైనా జనాలదారణే ముఖ్యం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.