Begin typing your search above and press return to search.
వృద్ధ జంబూకాలతో ఈదలేకపోతున్న జాతీయ పార్టీ
By: Tupaki Desk | 10 March 2020 5:12 AM GMTరాజకీయాలు మారాయి..ట్రెండ్ మారింది. వృద్ధులకు వీడ్కోలు పలుకుతూ ఉడుకునెత్తురు యువతరానికి రాజకీయ పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి కనుమరుగయ్యారు సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జశ్వంత్, యశ్వంత్ సింగ్, మేనకా గాంధీ, ఉమాభారతి , సుష్మ స్వరాజ్ లాంటి వారు.
కానీ 75 ఏళ్లకు పైబడిన కాంగ్రెస్ మాత్రం ఇంకా వృద్ధ జంబూకాలనే నమ్ముకుంది. వారే పార్టీకి దిక్కూ మొక్కూ అని యువ నేతలను తొక్కేస్తోంది. అదే ఇప్పుడు వారి పార్టీని కబళిస్తోంది. నామ రూపాల్లేకుండా కావడానికి దోహదపడుతోంది. వృద్ధ జంబూకాలను అందలమెక్కించి యువనేతలను తొక్కేస్తున్న కాంగ్రెస్ ను వీడుతున్నారు యువతరం. అంతిమంగా పాత కాపులతో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం ఖాయంగా కనిపిస్తోంది.
జ్యోతిరాదిత్యా సింధియా.. యువ నేత.. మన ఏపీ సీఎం జగన్ లా మధ్యప్రదేశ్ ప్రజల్లో యువతలో ఎంతో క్రేజ్ ఉన్న నేత.. ఏకంగా రాహుల్ గాంధీ సైతం సింధియాకే మధ్య ప్రదేశ్ సీఎం పీఠం ఇవ్వాలని అప్పట్లో పట్టుబట్టాడు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వృద్ధ జంబూకాలకే పట్టం కట్టింది. 75 ఏళ్ల దాటిన వృద్ధ రాజకీయ పిండం కమల్ నాథ్ ను మధ్య ప్రదేశ్ సీఎం పీఠం పై కూర్చోబెట్టింది. కట్ చేస్తే అలిగిన సింధియా ఇప్పుడు అదును చూసి మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ సర్కారును దెబ్బదీయడానికి కాచుకు కూర్చున్నారు.
చింత చచ్చినా పులుపు చావని చందంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా వృద్ధ నేతలనే పెంచి పోషిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి 17మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టారు. సీఎం కమల్ నాథ్ ను వీరు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. సీఎం కుర్చీ ఆశించి భంగపడిన జ్యోతిరాదిత్య సింధియా వారికి నేతృత్వం వహించి సీఎం కమల్ నాథ్ ను కూల్చే పనిలో పడ్డారు. ఈ పరిణామాలపై మధ్య ప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సెటైర్ల వర్షం కురిపించారు. ‘సింధియాకు స్వైన్ ఫ్లూ ఉన్నట్టుంది.. తమతో మాట్లాడటం వీలుకావడం లేదు’ అని సెటైర్లు వేశారు.
ఇలా యువనేతలను దూరం చేసుకోవడమే కాదు.. వారిని అవమానించేలా వృద్ధ రాజకీయ నేత డిగ్గీరాజా మాట్లాడడం.. దానికి కమల్ నాథ్ సపోర్టుగా నిలవడం.. కాంగ్రెస్ అధిష్టానం భీష్ముడిలా మౌనంగా ఉండడం చూసి కాంగ్రెస్ లోని నేతలు రగిలిపోతున్నారట.. ఈ వృద్ధ నేతలతోనే కాంగ్రెస్ కు ఈ గతి పట్టిందని ఆడిపోసుకుంటున్నారు. ఈ దహనకాండ ఆఖరకు మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేస్తుందనేది వేచిచూడాలి.