Begin typing your search above and press return to search.
కేంద్రమంత్రితో ప్రతిపక్ష ఎంపీ భేటీ.. ఏం జరిగింది..?
By: Tupaki Desk | 2 July 2019 5:55 AM GMTతెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు పార్టీ మారుతారో..? ఎవరు ఎవరికి షాక్ ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి చెందిన సగానికిపైగా ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇక ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఎలాగైనా ఇక్కడ బలపడి.. వచ్చే ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఇతర పార్టీల నేతలను లాగేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు నేతలు కమలం గూటికి చేరిపోయారు.
కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్.. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే.. కాంగ్రెస్..! అన్న గుర్తింపు పొందారు వారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలవగా.. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓడిపోయారు. ఆతర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి ఎంపీగా విజయం సాధించారు. రాహుల్ గాంధీ వద్ద పట్టుబట్టి మరీ భువనగిరి ఎంపీ సీటు దక్కించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వల్ప తేడాతో విజయం సాధించి మొత్తానికి ఎంపీ అయ్యారు. ఇప్పుడు ఈ సోదరుల కదలికలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.
ఇప్పటికే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదని, టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాను పార్టీ నుంచి బయటకు వెళ్లే క్రమంలో పార్టీ చేతే సస్పెండ్ చేయించుకోవాలన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. తాజాగా.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే బీజేపీ పెద్దలతో ఒకటిరెండు సార్లు మీట్ అయిన ఆయన తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవడంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని పలు రాష్ట్ర రహదారులను జాతీయ హైవేలుగా గుర్తించాలని గడ్కరీని కోరినట్లు ఆయన చెబుతున్నా.. లోలోపల మాత్రం ఏదో మతలబు ఉండే ఉంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కోమటిరెడ్డి బ్రదర్స్ హాట్ టాపిక్ గా మారారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీలోకి వెళ్లే అవకాశాలు మెండుగానే ఉన్నాయన్న వాదనకు వీరి భేటీ మరింత బలాన్ని ఇస్తోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి మరి.