Begin typing your search above and press return to search.
వూహాన్ నుంచి ఢిల్లీ కి 350 మందికి 344 మందే ఎందుకొచ్చారు?
By: Tupaki Desk | 1 Feb 2020 5:30 AM GMTకరోనా వైరస్ ఎంతలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ కు జన్మస్థానమైన వూహాన్ సిటీలో ఉన్న భారతీయుల్ని తాజాగా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకురావటం తెలిసిందే. తొలుత ఈ విమానంలో 350 మందిని తీసుకొస్తున్నట్లుగా ప్రకటించారు. అందుకు భిన్నంగా ఢిల్లీకి 344 మంది మాత్రమే వచ్చారు. మిగిలిన ఆరుగురు ఎందుకు రాలేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తొలుత అనుకున్నట్లే 350 మంది విమానం లో ఎక్కారు. కాకుంటే.. ఆరుగురు హైఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. వారిని చివరిక్షణాల్లో విమానం నుంచి దించేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారత్ కు వచ్చే ప్రత్యేక విమానంలో ఎక్కేందుకు చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆ ఆరుగురు విద్యార్థుల్ని అనుమతించలేదు.
దీంతో.. చివరి క్షణంలో వారి ప్రయాణం క్యాన్సిల్ అయ్యింది. ప్రస్తుతం వూహాన్ నగరంలో మరికొందరు భారత విద్యార్థులు ఉన్నారు. వీరందరి కోసం మరో ప్రత్యేక విమానాన్ని వూహాన్ నగరానికి పంపుతున్నారు. ఆ విమానంలో మిగిలిన వారిని భారత్ కు తీసుకురానున్నారు. చైనాలో ఆపేసిన ఆరుగురు విద్యార్థులు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. దీనిపై.. ఆందోళన వ్యక్తమవుతోంది.