Begin typing your search above and press return to search.

విరాట్ కోహ్లీకి బాలయ్య పూనాడా? అనుష్క శర్మ ఎందుకు డ్యాన్స్ చేసింది.?

By:  Tupaki Desk   |   24 Oct 2022 9:42 AM GMT
విరాట్ కోహ్లీకి బాలయ్య పూనాడా? అనుష్క శర్మ ఎందుకు డ్యాన్స్ చేసింది.?
X
నిన్న పాకిస్తాన్ పై భారత్ ను ఒంటిచేత్తో గెలిపించిన విరాట్ కోహ్లీపై ఇంటా బయటా ప్రశంసలు కురుస్తున్నాయి. విరాట్ విరోచిత ఇన్నింగ్స్ ను అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు విరాట్ కోహ్లీ టాపికే నడుస్తోంది. కోహ్లీ ఇన్నింగ్స్ గురించే ఓ రేంజ్ లో జనం చర్చించుకుంటున్నారు.

ఈ విజయం నేపథ్యంలో తాజాగా భారత దేశ విక్టరీ చూసిన కొందరు క్రికెట్ ప్లేయర్ కు, సినీ దిగ్గజానికి ముడిపెట్టి ఓ పోస్టర్ రెడీ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది. చాలా కాలం తర్వాత కింగ్ కోహ్లీ అసలు సిసలు ఇన్నింగ్స్ ఆడారని.. టీవీ ముందు కూర్చున్న అభిమానులకు పూనకాలు తెప్పించే పర్ పామెన్స్ చూపించాడని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల నడుమ కొందరికి నటసింహం బాలకృష్ణ గుర్తొచ్చి తాజాగా విడుదలైన ఆయన కొత్త చిత్రం 'వీరసింహారెడ్డి' కొత్త పోస్టర్ ను మీమ్ గా క్రియేటర్ చేశారు. విరాట్ తలను బాలయ్య బాడీకి అంటించి.. 'విరాట్ సింహా'ను క్రియేట్ చేసి ఓ మంచి పోస్టర్ ను డిజైన్ చేశారు.

బాలయ్య 107వ సినిమాకు 'వీరసింహారెడ్డి'గా టైటిల్ ఖరారు చేశారు. ఓ పవర్ ఫుల్ పోస్టర్ ను వదిలారు. ఓ మైలురాయిపై కాలుమోపిన బాలయ్య రూపం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ ఫొటోతోనే బాలయ్య మరో మ్యాజిక్ చేశాడని కొనియాడుతున్నారు.

అచ్చం బాలయ్య బాబు వేషధారణలో కోహ్లీ ఫొటో పెట్టి మార్ఫింగ్ చేశారు. 'వీరసింహారెడ్డి' పోస్టర్ లో గొడ్డలి ఉన్న చోట బ్యాట్ పెట్టారు. దీనిపై 'ఛేజింగ్ లో ఓడిపోవడం నా బయోడేటాలోనే లేదు' అని విరాట్ సింహ కోహ్లీ అనే ట్యాగ్ లైన్ జోడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో క్షణాల్లో ఈపోస్టర్ వైరల్ అయ్యింది. బాలయ్య బాబు రూపంలో విరాట్ ను చూసి అందరూ తెగ మురిసిపోతున్నారు. తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.

-విరాట్ ఇన్నింగ్స్ చూసి అనుష్క డ్యాన్స్

విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తో భారత్ ను గెలిపించడంతో ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్కశర్మ ఆనందం వ్యక్తం చేసింది. భర్తపై ప్రేమను ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రస్తావిస్తూ రాసుకొచ్చింది. భారత్ను గెలిపించిన విరాట్ ను చూసి నేను ఆనందంతో మ్యాచ్ ముగిశాక డ్యాన్స్ చేశాను. నేను అలా ఎందుకు చేస్తున్నానో నా కూతురికి అర్థం కాక గదంతా కలియతిరిగింది. తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని ఏదో ఒక రోజు తప్పకుండా తెలుసుకుంటుంది. క్లిష్ట దశను దాటి మునుపెన్నడూ లేనంత బలంగా నా భర్త తిరిగి వచ్చినందుకు గర్వంగా ఉందని.. అపరిమితమైన ప్రేమతో అనుష్క శర్మ పోస్ట్ చేసింది. థాంక్యూ మై లవ్ నాకు మద్దతుగా ఉన్నావని కోహ్లీ కూడా అనుష్కకు రిప్లై ఇచ్చారు. ఇలా కోహ్లీపై ఇంటా బయటా ప్రశంసలు కురుస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.