Begin typing your search above and press return to search.

ఎలన్ మస్క్ కొడుకు ఎందుకు అమ్మాయిగా మారాడు? ఎందుకు తండ్రితో కటీఫ్?

By:  Tupaki Desk   |   26 Jun 2022 1:30 AM GMT
ఎలన్ మస్క్ కొడుకు ఎందుకు అమ్మాయిగా మారాడు? ఎందుకు తండ్రితో కటీఫ్?
X
ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు.. బిలియనీర్ ఎలోన్ మస్క్ ఈసారి తన కుటుంబం కారణంగా వార్తల్లో నిలిచాడు. ఎలన్ మస్క్ కుమారుడు జేవియర్ మస్క్ ట్రాన్స్ జెండర్ గా మారిపోవడం చర్చనీయాంశమైంది. తన కొత్త లింగ గుర్తింపుకు అనుగుణంగా తన పేరును 'మార్చాలని' కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అతడు తన జీవసంబంధమైన తండ్రి ఎలన్ మస్క్ తో అన్ని సంబంధాలను కూడా తెంచుకోవాలనుకుంటున్నాడు. ఏప్రిల్ నెలలో జేవియర్ మస్క్ 18 ఏళ్లు నిండిన ఒక రోజు తర్వాత శాంటా మోనికాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. అబ్బాయిగా పుట్టిన ఎలన్ మస్క్ అసలు ఎందుకు అమ్మాయిగా మారాడు. ఎలన్ మస్క్ తో సంబంధం ఎందుకు వద్దనుకుంటున్నాడన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఎలన్ మస్క్ కుమారుడు లింగమార్పిడి చేసుకొని అమ్మాయిగా మారడానికి కోర్టు తాజాగా అనుమతి ఇచ్చింది. 18 ఏళ్ల జేవియర్ తన లింగాన్ని మార్చుకున్న తర్వాత తన పేరును తండ్రి ఇంటి పేరు వద్దనకుంటూ ‘వివియన్ జెన్నా విల్సన్’గా మార్చుకున్నాడు. లీగల్ డాక్యుమెంట్లలో కూడా మార్చాలని.. కొత్త జనన ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. కోర్టు దీనికి అంగీకరించింది. తండ్రితో సంబంధాలు కట్ చేసుకుంటానని జేవియర్ పిటీషన్ లో పేర్కొన్నాడు.

జేవియర్ మస్క్ తన తండ్రి యొక్క ప్రసిద్ధ ఇంటిపేరు మస్క్ ను వదిలివేసి.. బదులుగా తన తల్లి ఇంటిపేరును స్వీకరించాలని కోరుకున్నాడు. జేవియర్ తల్లి జస్టిన్ విల్సన్.. ఈమె కెనడా నటిగా ఫేమస్. ఆమె 2008లో ఎలన్ మస్క్ నుంచి విడాకులు తీసుకుంది.ఈమెనే ఎలన్ మస్క్ కు మొదటి భార్య. ఎలోన్ మస్క్ -జస్టిన్ విల్సన్‌లు 2000 నుండి 2008 వరకు వివాహం జీవితాన్ని కొనసాగించారు. జేవియర్ మస్క్‌కి గ్రిఫిన్ అనే కవల సోదరుడు కూడా ఉన్నాడు.

ఎలన్ మస్క్ ఎప్పుడూ కూడా లింగమార్పిడి సమస్యలపై వ్యతిరేకంగా మాట్లాడి విమర్శిస్తుంటాడు. మస్క్ ను చాలా మంది ‘యాంటీ గే’ అని కూడా అంటారు. అమెరికా ప్రభుత్వం ‘ట్రాన్స్ జెండర్ల’ హక్కులపై విధించిన పరిమితులకు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపాడు. ఇదే తండ్రి ఎలన్ మస్క్.. కొడుకు జేవియర్ మధ్య విభేదాలకు కారణమైందని సమాచారం. వారిద్దరి మధ్య గొడవ జరగడంతోనే జెన్నా తన తండ్రి ఎలన్ మస్క్ తో ఏ రూపంలోనూ కోరుకోవడం లేదని తెలుస్తోంది.

ఎలన్ మస్క్ తాజాగా టెస్లా మీడియా కార్యాలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగానే మీడియా ఆయన కుమారుడి విషయమై ప్రశ్నించగా ఎవరూ స్పందించలేదు. దీంతో కుమారుడు ఇలా మారిపోవడానికి ఎలన్ మస్క్ కారణమా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.