Begin typing your search above and press return to search.
ఐక్యరాజ్యసమితిలో చైనాకు భారత్ సపోర్టు.. అంతా షాక్
By: Tupaki Desk | 7 Oct 2022 9:01 AM GMTభారత్-చైనాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులున్నాయి. గాల్వాన్ లో భారత్, చైనా సైనికుల ఘర్షణలో 22 మంది భారత సైనికులు వీరమరణం పొందాక చైనా నుంచి పూర్తిగా దూరం జరిగింది భారత్. ఈ క్రమంలోనే చైనా యాప్స్ ను నిషేధించి.. వారి వ్యాపారాలు ఇక్కడ అక్రమంగా సాగకుండా కట్టడి చేసింది. ప్రపంచవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.
ఎప్పుడూ ఉప్పూ నిప్పుగా ఉండే భారత్-చైనాలు ఓ విషయంలో మాత్రం సహకరించుకోవడం విశేషం. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులో మానవ హక్కుల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి హక్కుల మండలిలో 51వ రెగ్యులర్ సెషన్ లో చైనాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత్ ఓటింగ్ కు గైర్హాజరు అయ్యింది.
చైనా అనుకూల కోర్ గ్రూపు దేశాలు సైతం వ్యతిరేకించినా భారత్ పరోక్షంగా సహకరించింది. నిజానికి చైనాలో ఆ ప్రావిన్సులో మానహక్కుల ఉల్లంఘన జరుగుతోంది.
చైనాలోని ముస్లిం తెగలపై అక్కడి ప్రభుత్వం దమనకాండ చేస్తోంది. అయినా కూడా భారత్ ఇలా ఓటింగ్ కు గైర్హాజరు కావడం ఏంటన్నది అంతుబట్టడం లేదు.
చైనా లో ముస్లింలు అత్యధికంగా జిన్జియాంగ్ ప్రాంతంలో నివసిస్తుంటారు. అక్కడ ముస్లిం ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, టీచర్లు రంజాన్ దీక్ష చేస్తారు. వారిపై చైనా ప్రభుత్వం దీక్ష చేయవద్దని నిషేధం విధిస్తూ ఆదేశాలిచ్చింది. అంతేకాదు హోటళ్లు, రెస్టారెంట్లు యథావిధిగా పనిచేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
చైనా ప్రభుత్వం నిషేధంతో మత ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని మెజార్టీ దేశాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఘర్షణల్లో వందమంది ప్రాణాలు కోల్పోయారని.. చైనాలోని కమ్యూనిస్టు నాస్తిక నేతల మత చాందసవాదం వల్ల మరోసారి ఉగ్రవాద ముప్పు పెరిగిపోతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముస్లింల మత విశ్వాసం ఈ ప్రాంతంలో హింస కు దారితీస్తోందని... అందుకే దీక్షలపై నిషేధం విధించామని చైనా అధికారప్రతినిధి తెలిపారు. స్కూలు విద్యార్థులపై కూడా ఈ ఆంక్షలు విధించారు. గుర్తింపు కార్డు లేకుండా మసీదులోకి ఎవరిని అనుమతించవద్దని ముస్లిం మతపెద్దలకు స్పష్టం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.