Begin typing your search above and press return to search.
నిజామాబాద్ సభలో కవిత ఎందుకలా చేశారు?
By: Tupaki Desk | 6 Sep 2022 5:06 AM GMTకల్వకుంట్ల కవిత. పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తండ్రికి తగ్గట్లే మాటల్లో ఆమె మరిపిస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తండ్రి పోరాటంలో భాగం కావటమే కాదు.. బతుకమ్మ పేరుతో ఆమె చేసిన ప్రయత్నాల్ని తక్కువ చేసి చూడలేం.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముద్దుల తనయ అయిన కవిత.. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు ఆమె కూడా హాజరయ్యారు. అయితే.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని సిత్రమైన సీన్ ఒకటి తాజాగా ఎపిసోడ్ లో చోటు చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. పార్టీ నిర్వహించే బహిరంగ సభల్లో తన గళాన్ని వినిపించటమే కాదు.. ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేస్తుంటారు. కేసీఆర్ కుమార్తెగా ఆమెకు దక్కే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ తో పాటు.. జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే క్రమంలో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మిగిలిన వారి కంటే ముందుగా ఆమె హాజరయ్యారు. ఎమ్మెల్యే..
ఎమ్మెల్సీల కంటే ముందుగా సభా వేదిక వద్దకు చేరుకున్న ఆమె.. వేదికపై ఆసీనులయ్యారు. బహిరంగ సభతో పాటు.. కొత్త కలెక్టరేట్.. జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆమె వెళ్లకుండా దూరంగా ఉండటం గమనార్హం. దాదాపు వేదికపైన గంట పాటు ఉన్నా కనీస ప్రసంగం కూడా చేయకపోవటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది.
ఢిల్లీలో చోటు చేసుకున్న లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర మీద ఢిల్లీకి చెందిన ఎంపీ.. ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేయటం.. దీనిపై కవిత అంతే తీరుత రియాక్టు కావటం.. కోర్టును ఆశ్రయించి.. లిక్కర్ స్కాంలో తనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయకుండా ఉత్తర్వుల్ని తెచ్చుకోవటం తెలిసిందే. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని.. ప్రగతి భవన్ లో అందరి ముందు కవితను మందలించారంటూ ఒక ప్రముఖ మీడియా సంస్థ వార్త వేయటం.. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే.
తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో అదే అంశం చర్చకు రాగా.. సదరు మీడియా సంస్థ ఎండీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయటం నిజమని.. దానికి తన వద్ద పక్కా ఆధారం ఉందని చెప్పటంతో పాటు.. ఆగ్రహం వ్యక్తం చేసిన సమయంలో.. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటను కూడా తాను చెప్పగలనని పేర్కొనటం ఆసక్తికరంగా మారింది. ఆ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత.. వేరే టాపిక్ లోకి వెళ్లిపోయిన వైనం సదరు ఇంటర్వ్యూలో కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.