Begin typing your search above and press return to search.
తిండి దొరికితే చాలు అనుకున్నోడి పేరును మోడీ ఎందుకు ప్రస్తావించారు?
By: Tupaki Desk | 26 July 2021 4:42 AM GMTఐసాక్ ముండా.. యూట్యూబ్ ల్ని బాగా ఫాలో అయ్యే వారికి తెలిసిన పేరు. ఒక సాదాసీదా రైతు కూలీగా ఉండే ఐసాక్ ఇప్పుడు ఐకానిక్ గా మారారు. దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా తన మన్ కీ బాత్ లో అతడి గురించి ప్రస్తావించటం.. అతడి విజయాన్ని అందరికి తెలిసేలా చేయటమే. ఇంతకీ ఈ ఐసాక్ ఎవరు?
మోడీ అతడి పేరును ఎందుకు ప్రస్తావించారు? అతడు ఎక్కడ ఉంటారు? అతడి విజయంలో భాగస్వామ్యులు ఎవరు? ఒకప్పుడు తినేందుకు కాస్తంత తిండి దొరికితే చాలు.. అదే పది వేలు అన్న దారుణ పరిస్థితి నుంచి.. ప్రధాని మోడీ ఆయన్నో స్ఫూర్తివంతమైన ఉదాహరణగా ఎందుకు చెప్పారు? అతడు సాధించిన విజయం ఎలాంటిది? అదెలా సాధ్యమైంది? అందుకు అతడు పడిన తిప్పలెన్ని? ఐసాక్ వీడియోల్లో ఏముంటుంది? లక్షలాది మంది అతడి వీడియోలు చూడటానికి ఆసక్తిని ప్రదర్శిస్తారెందుకు? లాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు దొరకాలంటే.. అతడి జీవనయాన్ని.. గతాన్ని.. వర్తమానాన్ని తెలుసుకోవాల్సిందే. అప్పుడే అతడి విజయం ఎంత అరుదైనదో ఇట్టే అర్థమవుతుంది.
ఒడిశాకు చెందిన ఐసాక్ ముండా సంబల్ పూర్ జిల్లాలో నివిస్తుంటాడు. చదువుకోని ఇతడికి పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు. రోజు కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రోజు గడవటమే గగనం అన్నట్లుగా ఉండే అతడి జీవితంలోకి కరోనా రేపిన కలకలం అంతాఇంతా కాదు. కూలీ పని పోయింది. రోజువారీ తిండి కూడా గగనమైంది. అకస్మాత్తుగా వచ్చిన లాక్ డౌన్ తో దిక్కుతోచని పరిస్థితి. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఐసాక్ ముండాకు యూట్యూబ్ లో వీడియోలు చూసే అలవాటు ఎక్కువ. ఏ మాత్రం ఖాళీ దొరికినా వాటిని చూసేవాడు. స్నేహితుల ఫోన్లలో ఫుడ్ బ్లాగర్లకు సంబంధించిన వీడియోల్ని తరచూ చూసేవాడు.
అతడికున్న కష్టాల వేళ.. యూట్యూబ్ లో ఒక వీడియో చేయాలని అనుకున్నాడు. కానీ.. అతడి దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. దీంతో.. ధైర్యం చేసి రూ.3వేలకు అప్పు చేసి కొన్నాడు. తను ఇంట్లో రోజూ ఏం తింటాడు? ఎలా తింటాడు. అన్న వివరాలతో ఒక వీడియో ఉంది. దాన్ని అప్ లోడ్ చేసిన అతడికి దిమ్మ తిరిగేషాకిస్తూ.. చాలా స్వల్ప వ్యవధిలోనే 5లక్షల మంది అతడి వీడియోను చూశారు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షించిన ఈ వీడియో తర్వాత.. ఎలాంటి వీడియోలు తీయాలో అతనికి అర్థమైంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
రోజువారీ జీవన విధానానికి సంబంధించిన వీడియోల్ని అతడు అప్ లోడ్ చేస్తాడు. అతడి గ్రామంలోని పరిస్థితులు.. అతని రోజువారీ జీవితానికి సంబంధించిన వీడియోల్ని చేస్తుంటాడు. నిత్యం తాను జీవితంలో ఎదుర్కొనే కష్టాలపై అందరికి అవగాహన కలిగేలా చేస్తాడు. అందుకు తగ్గ వీడియోలు తీస్తుంటాడు. ఇప్పుడు అతడో బ్రాండ్ గా మారాడు. అతడి వీడియోలు అతడికి చక్కటి ఆదాయాన్ని లభించేలా చేశాయి. ప్రస్తుతం అతడి ఆదాయం నెలకు లక్షల్లో ఉంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ లో ఐసాక్ గురించి ప్రస్తావిస్తూ.. అతడి స్ఫూర్తివంతమైన జీవితాన్ని ప్రస్తావించారు.
‘ఒకప్పుడు ఐసాక్ గారు ఓ సాధారణ రోజు కూలీ. కానీ ఇప్పుడు ఆయనో ఇంటర్నెట్ సెన్సేషన్. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన మెరుగైన సంపాదన కూడా పొందగలిగారు. స్థానిక పద్ధతులు, జీవిన విధానం, ఆహారపు అలవాట్లు, సంప్రదాయ పద్ధతుల్లో వంట చేయడం లాంటి వాటి గురించి వీడియోలు రూపొందిస్తారు’ అని మోడీ చెప్పిన మాటలు వైరల్ కావటమే కాదు.. ఐసాక్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దేశ ప్రధాన మంత్రి తన పేరును చెప్పటాన్ని ఐసాక్ నమ్మలేకపోతున్నాడు. విపరీతమైన ఆనందానికి గురయ్యారు.
‘ప్రధాని మోదీ గారు నా పేరును ప్రస్తావించారని తెలిసి పట్టలేనంత సంతోషం కలిగింది’ అంటూ ఐసాక్ ముండా వ్యాఖ్యానించారు. జీవితంలో అందరికి అవకాశాలు సమానంగా ఉంటాయి. వాటిని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారన్నది ఎవరికి వారి చేతుల్లోనే ఉంటుందన్నది ఈ ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.